»   » బాలకృష్ణతో పోటీపడటానికి నాగచైతన్య రెడీ !?

బాలకృష్ణతో పోటీపడటానికి నాగచైతన్య రెడీ !?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, సుకుమార్‌ కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న చిత్రం సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇక సంక్రాంతికి ఇప్పటికే బాలకృష్ణ,దాసరి కాంబినేషన్ లో రెడీ అవుతున్న..పరమవీర చక్ర చిత్రాన్ని ప్రకటించారు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సినీ స్టార్ గానూ, మేజర్ గానూ ద్విపాత్రలు చేస్తున్నారు. ఇక తమన్నా హీరోయిన్ గా చేస్తున్న నాగచైతన్య చిత్రానికి ఇప్పటివరకూ టైటిల్ నిర్ణయించలేదు. అయితే సుకుమార్...ఈ చిత్రం కోసం 'దటీజ్‌ మహాలక్ష్మి.." అనే టైటిల్ ‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ టైటిల్ హీరోయిన్ ఓరియెంటెడ్ ఉందని నాగచైతన్య నసుగుతున్నట్లు చెప్తున్నారు. అలాగే నాగేశ్వరరావు, దాసరి కాంబినేషన్ లో వచ్చిన ప్రేమాభిషేకం చిత్రంలోని నా కళ్ళు చెప్తున్నాయి...నిన్ను ప్రేమిస్తున్నాయని..నా హృదయం చెప్తోంది..పాటని రీమిక్స్ చేసి నాగచైతన్య, తమన్నాలపై చిత్రీకరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రం గురించి చెబుతూ...ప్రతీ ఒక్కరికీ నచ్చే ఎలమెంట్ ఈ స్క్రిప్టులో ఉంది ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటున్నారు. మరి వచ్చే సంక్రాంతికి నాగచైతన్య, బాలయ్యలలో ఎవరు విన్ అవుతారో చూడాలి.మరో ప్రక్క రామ్ గోపాల్ వర్మ..తన తాజా చిత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కూడా సంక్రాంతికే రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu