మరో సినిమాకు నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్! ఈ సారి బాలీవుడ్ రీమేక్..
అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇటీవలే 'మజిలీ' రూపంలో భార్య సమంతతో కలిసి భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం వరుస కమిట్మెంట్స్‌తో బిజీ అవుతున్నాడు. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు నాగ చైతన్య ఓ బాలీవుడ్ రీమేక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
తాజాగా సమాచారం మేరకు నిర్మాత దిల్‌రాజు బాలీవుడ్ సినిమా బదాయి హో సినిమా తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు దిల్‌రాజు, బోనీకపూర్‌లు ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసమై నాగ చైతన్యను సంప్రదించగా, అందుకు ఆయన ఓకే చెప్పాడని టాక్. అయితే దీనిపై అఫీషియల్ సమాచారం మాత్రం లేదు.

మరోవైపు ప్రస్తుతం నాగచైతన్య.. వెంకీమామ సినిమాలో, అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇవి పూర్తికాగానే అజయ్ భూపతి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అంటే మరి కొన్ని నెలల పాటు అక్కినేని నాగచైతన్య బిజీ షెడ్యూల్ లో ఉన్నారన్నమాట. చూడాలి మరి ఇంత బిజీ షెడ్యూల్ నడుమ దిల్ రాజు బాలీవుడ్ రీమేక్ సినిమాలో ఆయన నటిస్తాడా? లేదా? అనేది.


Click it and Unblock the Notifications











