For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bhola Shankar: చిరంజీవి సినిమాలో మరో తెలుగు హీరో.. అదిరిపోయే ఆఫర్ పట్టేసిన లవర్ బాయ్

  |

  సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం 'సైరా: నరసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ఆశించిన స్థాయిలో ఆడకున్నా.. ఆ వెంటనే 'ఆచార్య' అనే సినిమాను మొదలెట్టారు. ఇది పట్టాలపై ఉండగానే చిరంజీవి.. మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు.

  అలా ఇప్పుడు ఒకేసారి మూడు నాలుగు చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్.. తన సినిమాలో మరో తెలుగు హీరోకు అవకాశం కల్పించారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ఆచార్యగా రాబోతున్న చిరంజీవి

  ఆచార్యగా రాబోతున్న చిరంజీవి

  మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

  RRR First Review: విడుదలకు ముందే లీకైన రిపోర్టులు.. అసలు పాయింట్ అదే.. సినిమా ఎలా ఉంటుందంటే!

  ఒకేసారి అన్ని... అది హైలైట్‌గా

  ఒకేసారి అన్ని... అది హైలైట్‌గా

  'ఆచార్య' పట్టాలపై ఉండగానే మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో లూసీఫర్‌కు రీమేక్‌గా వస్తున్న 'గాడ్ ఫాదర్'తో పాటు కేఎస్ రవీంద్ర/బాబీ తెరకెక్కిస్తోన్న ఓ చిత్రం ఉన్నాయి. వీటితో పాటు వేదాళం మూవీకి రీమేక్‌గా తెరకెక్కనున్న 'భోళా శంకర్' కూడా ఉంది. దీన్ని ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరున్న మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్నాడు.

  చెల్లితో కలిసి వస్తున్న శంకరుడు

  చెల్లితో కలిసి వస్తున్న శంకరుడు

  సోదరి సెంటిమెంట్ స్టోరీతో పూర్తి స్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న 'భోళా శంకర్' సినిమాలో హీరో సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు.

  Akhanda OTT: బాలయ్య సినిమా స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్.. పండుగ కానుకగా ఆరోజే.. మరి టీవీలో ఎప్పుడంటే!

  స్పీడుగా షూటింగ్.. అప్‌డేట్లతో

  స్పీడుగా షూటింగ్.. అప్‌డేట్లతో

  చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ దిగ్విజయంగా పూర్తైందని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, ఇందులో ఓ భారీ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ గ్రాండ్ సాంగ్‌ను కూడా పూర్తి చేసినట్లు తెలిపింది. అలాగే, రెండో షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే మొదలు పెట్టేసినట్లు కూడా మూవీ టీమ్ వెల్లడించింది.

  కీర్తి సురేష్ కోసం మరో హీరోతో

  కీర్తి సురేష్ కోసం మరో హీరోతో

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమెకు జోడీగా నటించాల్సిన ఓ యంగ్ హీరో పాత్ర కూడా ఉంది. దీనికి ఎవరిని తీసుకోవాలన్న దానిపై చిత్ర యూనిట్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంతో మంది పేర్లను దర్శక నిర్మాతలు పరిశీలించారని తెలిసింది.

  భర్తతో టాలీవుడ్ హీరోయిన్ లిప్‌లాక్: ఆ ఫొటోను షేర్ చేసిన కాజల్.. పర్సనల్ పిక్ లీక్ చేయడంతో రచ్చ

  లవర్ బాయ్‌కు చిరంజీవి ఆఫర్

  లవర్ బాయ్‌కు చిరంజీవి ఆఫర్

  క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'భోళా శంకర్' సినిమాలో కీర్తి సురేష్‌కు జోడీగా నటించే హీరోపై తాజాగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోల్ కోసం టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న నాగశౌర్యను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. ఇప్పటికే దర్శకుడు మెహర్ రమేష్ అతడితో చర్చలు కూడా జరిపాడని తెలుస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

  English summary
  Megastar Chiranjeevi Doing Bhola Shankar Movie with Director Meher Ramesh. Young Hero Naga Shaurya To Play Key Role in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion