For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మనోళ్లను నమ్మను బాబోయ్: నాగచైతన్య నయా డెశిషన్ వెనుక?

  By Srikanya
  |

  హైదరాబాద్ : చూస్తూంటే నాగచైతన్య కు ఇక్కడ దర్శకులు, కథలుపై నమ్మకం పూర్తిగా పోయినట్లుంది. ఆయన కు కథ చెప్పటానికి వెళ్లే తెలుగు దర్శకులపై ఇంట్రస్ట్ చూపటం లేదని, వారికి డేట్స్ లేవు, ఇప్పడు వినటం లేదని చెప్పి పంపించేస్తారని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి.

  దానికి తోడు ప్రస్తుతం గౌతమ్ మీనన్ తో సినిమా చేస్తున్న 'సాహసం శ్వాసగా సాగిపో' తర్వాత..నాగ చైతన్య మరో తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా రీసెంట్ గా ఆయన్ను మరో ఇద్దరు తమిళ అప్ కమింగ్ దర్శకులు కలిసి కథలు చెప్పినట్లు తెలుస్తోంది. మద్యలో చేస్తున్న ప్రేమమ్ చిత్రం ..మళాయళంలో సూపర్ హిట్టైన ప్రేమమ్ రీమేక్.

  ఇవన్నీ చూస్తూంటే నాగచైతన్య చేస్తే తమిళ స్టార్ డైరక్టర్స్ తో లేదా రీమేక్ లతో ముందుకు వెళ్లాలని ఫిక్సైనట్లు అనిపిస్తోంది. అందుకోసం ఆయన నిరంతరం తమిళం, మళయాళంలో వస్తున్న సినిమాలు అప్ డేట్స్ తీసుకుంటున్నారని చెప్తున్నారు.

  తెలుగులో స్టార్ డైరక్టర్స్ తనతో చేయటానికి ఆసక్తి చూపకపోవటం, ఒక హిట్ కొట్టిన దర్శకులతో ముందుకు వెళ్తే వారు దోచేయ్ స్దాయిలో తన కెరీర్ నే దెబ్బ కొట్టడం నాగచైతన్యను ఈ డెసిషన్ తీసుకునేలా చేసిందని అంటున్నారు.

  అఫ్ కోర్స్ వరస ఫ్లాపులు వచ్చినప్పుడు ఎవరికైనా అదే అనిపిస్తుంది అనుకోండి. అయితే తన తండ్రికు తెలుగు డైరక్టర్ కళ్యాణ కృష్ణ, తెలుగుతనం తో ఉన్న కథతోనే హిట్ కొట్టాడనే విషయం మర్చిపోతున్నాడు. అయితే కళ్యాణ కృష్ణతో తన తండ్రి మాట తీసేయలేక ఓ సినిమా కమిటయ్యాడని సమాచారం.

  తనకు తెలుగు దర్సకులు హిట్ ఇవ్వలేము అనుకున్నప్పుడు ఏమిమాయ చేసావే అంటూ గౌతమ్ మీనన్ వచ్చి హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చి హిట్టైన హండ్రెడ్ పర్శంట్ లవ్ మాత్రమే. తెలుగు దర్శకుడు, తెలుగు కథ . మళ్లీ హిట్ పలకరించింది కేవలం తడాఖాతోనే. అదీ తమిళ రీమేక్. అందుకే అతను తమిళం దర్శకుడో, లేక పరభాషా రీమేక్ అయితేనే బెస్ట్ అని ఫిక్స్ అయ్యాడట.

  నాగచైతన్య ఇప్పటివరకూ వచ్చిన సినిమాలను పరిశీలిద్దాం..

  జోష్

  జోష్

  వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వచ్చిన ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ గా నమోదైంది. తొలి చిత్రమే దారుణమైన దెబ్బ కొట్టి నిరాశలో ముంచేసింది

  ఏ మాయ చేసావే

  ఏ మాయ చేసావే

  గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నాగచైతన్య కెరీర్ ని మలుపు తిప్పిందనే చెప్పాలి. అయితే సమంతకే ఈ సినిమా లైఫ్ ఇచ్చిందనేది కూడా మర్చిపోకూడదు.

  దడ

  దడ

  మోడర్న్ ధాట్ తో చేస్తున్న కమర్షియల్ చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం నాగచైతన్యకు నిజంగానే దడ పుట్టించింది.

  బెజవాడ

  బెజవాడ


  నాగచైతన్య.. రామ్ గోపాల్ వర్మ నిర్మాణం ఇవి చాలు ఏ ప్రేక్షకుడునినైనా ధియోటర్ కు తీసుకు వెళ్లటానికే. అయితే ఇదీ భారీ స్దాయిలో దెబ్బకొట్టింది

  100% లవ్

  100% లవ్

  సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నాగచైతన్యకు వరస ఫ్లాపుల తర్వాత రిలీఫ్ ఇచ్చింది.

  తడాఖా

  తడాఖా


  తమిళ చిత్రం వెట్టై రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం నాగచైతన్యకు మళ్లీ హిట్ రుచి చూపించింది

  మనం

  మనం


  అక్కినేని కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ కానీ , ఆ క్రెడిట్ కుటుంబంలో అందరూ పంచుకోవాల్సి వచ్చింది. దర్శకుడు విక్రమ్ కుమార్ తెలుగువాడు కాదు.

  ఆటో నగర్ సూర్య

  ఆటో నగర్ సూర్య

  దేవకట్టా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన ఈ చిత్రం ఫైనల్ గా ఓ ప్లాఫ్ గా మిగిలిపోయింది.

  ఒక లైలా కోసం...

  ఒక లైలా కోసం...

  గుండె జారి గల్లంతైంది అంటూ హిట్ కొట్టిన దర్శకుడుతో చేసిన ఈ సినిమా ఫెయిల్యూర్ అయ్యింది. మళ్లీ నిరాశే

  దోచేయ్

  దోచేయ్


  స్వామి రారా చిత్రంతో హిట్ కొట్టిన సుధీర్ వర్మకు దర్శకత్వం ఛాన్స్ ఇస్తే ఆయనో ఫ్లాఫ్ తీసి ఇచ్చాడు

  సాహసం శ్వాశగా సాగిపో

  సాహసం శ్వాశగా సాగిపో


  గౌతమ్ మీనన్ మరోసారి ఈ రొమాంటిక్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి

  ప్రేమమ్

  ప్రేమమ్

  మళయాళ సూపర్ హిట్ ప్రేమమ్ రీమేక్ చేస్తున్న నాగచైతన్య...ఈ సినిమాని టైటిల్ కూడా మార్చటానికి ఇష్టపడటం లేదు

  English summary
  Naga Chaitanya showing intrest on Remakes and Tamil directors only.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X