»   » హీరో సూర్య రిజెక్ట్ చేసిన కథతో నాగ్

హీరో సూర్య రిజెక్ట్ చేసిన కథతో నాగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : కొద్ది రోజుల క్రితం హీరో సూర్య ప్రెస్ మీట్ పెట్టి మరీ...తనకు కథ నచ్చకే ..పూజతో ప్రారంభమైన తన చిత్రం షూటింగ్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆ దర్శకుడు మరెవరో కాదు గౌతమ్ మీనన్. అయితే ఇప్పుడా కథ నాగార్జున వద్దకు చేరుకుందని సమాచారం. గతంలో తన కుమారుడు నాగ చైతన్య కి హిట్ ఇచ్చిన గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నాగార్జున ఈ సినిమా చేయబోతున్నారనే టాక్ వినపడుతోంది.

ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తారని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కుదుర్చుకున్న ఒప్పంద ప్రకారం బెల్లంకొండ సురేష్ సంస్థలో గౌతమ్‌మీనన్ ఓ సినిమా చేయాల్సివుందని, అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని...పస్తుతం గౌతమ్‌మీనన్ డేట్స్ ఖాళీగా వుండటంతో నాగార్జునతో సినిమా చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.

మరో ప్రక్కన నాగ చైతన్య కు 'తడాఖా' వంటి హిట్ ఇచ్చిన డాలి తోనూ నాగార్జున చేయనున్నారని తెలుస్తోంది. దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించే చిత్రానికి నాగార్జున ఇదివరకే అంగీకారం తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుందని చెప్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల్లో ఏది ముందు పట్టాలు ఎక్కుతుందో తెలియాలి. భాయ్ డిజాస్టర్ టాక్ తో నాగార్జున ...కథలపై చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

'భాయ్' చిత్రాన్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూట్ చేసిన నాగార్జున నష్టపోయారని చెప్పకతప్పదు. అయితే తొలిప్రయత్నం విఫలమైనా ఏ మాత్రం బెదురు లేకుండా ముందుకు సాగుతున్నారు నాగార్జున. తాజాగా రూపొందుతున్న అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ 'మనం' చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట నాగార్జున.

English summary

 Bellamkonda Suresh is coming up with a film to be directed by Gautham Menon, Nagarjuna is the hero. Talks are currently on and the details will be let out soon. Gautham Menon who gave a massive hit 'Ye Maaya Chesave' with a sweet young love story is now all set to make a matured romantic movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu