twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునకి ఇష్టం లేకపోయినా రిలీజ్

    By Srikanya
    |

    చెన్నై : నాగచైతన్య, అమలాపాల్‌ జంటగా తెలుగులో విడుదలైన చిత్రం 'బెజవాడ'. శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్‌ బ్యానరుపై ఏఎన్‌ బాలాజీ, గోవిందరాజ్‌ సంయుక్త నిర్మాణంలో 'విక్రందాదా'గా తమిళంలోకి అనువాదమవుతోంది. ఈ డిజాస్టర్ చిత్రం డబ్బింగ్ అయ్యి తమిళంలోకి వెళ్లటం అసలు నాగార్జునకి ఇష్టం లేదని సమాచారం. అయితే నిర్మాతలు ఈ చిత్రం తమిళ రైట్స్ అమ్మేయటం వల్ల డబ్బింగ్ చేసేసారని తెలుస్తోంది.

    ఈ చిత్రం తమిళంలోకి ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారని నాగార్జున అడిగితే...అక్కడ రామ్ గోపాల్ వర్మ కు క్రేజ్ ఉండటం, అమలా పాల్ హీరోయిన్ కావటం, కీ రోల్ పోషించిన ప్రభు తమిళవాడు కావటం వంటి అంశాలు చెప్పారని అది విన్న నాగార్జున మండిపడ్డారని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఓ ప్లాప్ సినిమాతో అక్కడ నాగాచైతన్య ప్రేక్షకులకు తెలియటం ఇష్టం లేదని ఆయన ఉద్దేశ్యం అని తెలుస్తోంది.

    ఇక ఈ చిత్రానికి వివేక్‌కృష్ణ దర్శకత్వం వహించారు. యాక్షన్‌ హంగులతో తెరకెక్కించారు. తమిళ వాతావరణానికి తగ్గట్లు మాటల్ని అనువదించామని సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. ఏఆర్‌కే రాజరాజా మాటలు అందించారు. కోటశ్రీనివాసరావు, అజయ్‌, అభిమన్యు, శుభలేఖ సుధాకర్‌, సత్యప్రకాశ్‌, అంజనా తదితరులు నటించారు.

    అలాగే తాను రామ్ గోపాల్ వర్మ తీసిన బెజవాడ చిత్రంలో నటించటానికి ఒప్పుకోవటమే పెద్ద తప్పు చేయటమని అమలా పౌల్ అంది. ఆమె మీడియా తో మాట్లాడుతూ...తాను వర్మ సినిమా అనే కేవలం ఒప్పుకున్నానని అంది. తనకు ఆ సమయంలో బయట చాలా ఆఫర్స్ వచ్చినా వర్మ సినిమా కదా అని వాటిని అన్నిటినీ వదులుకున్నానని అంది. బెజవాడకు ముందు తెలుగు నిర్మాతలు, దర్శకులు నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయని, అయితే ఇప్పుడు అవన్నీ మిస్సయ్యానని అని ఆవేదనతో చెప్పుకొచ్చింది.

    నాగచైతన్య హీరోగా, వివేక్ కృష్ణ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ బెజవాడ చిత్రం రూపొందింది. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. కథ, కథనాలు సరిగ్గా లేకపోవటం, టెక్నికల్ గా నాశిరకంగా ఉండటంతో మొదటి రోజే బాక్స్ లు వెనక్కి వెళ్లిపోయే పరిస్దితి వచ్చింది. దానికి తోడు వర్మ .. బెజవాడ టైటిల్ ని టార్గెట్ చేస్తూ విపరీతమైన హైప్ క్రియేట్ చేసారు. ఆ హైప్ కి తగ్గట్లు సినిమా లేకపోవటం చాలా మందిని నిరాశపరిచింది.

    English summary
    
 Naga Chaitanya's mass entertainer Bezawada directed by Ram Gopal Varma is dubbed in Tamil as Vikram Dada. Currently the film is under dubbing. Amala Paul is the heroine while Prabhu played a key role in the film. Filmmakers hope that these two will be added advantage in Kollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X