Nagarjuna: నాగార్జున ‘కింగ్ 100’.. ముగ్గురు హీరోయిన్స్ అంట!
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో కొత్త మైలురాయిగా నిలిచే సినిమా #King100 ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కింగ్ నాగార్జున వందో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి "లాటరీ కింగ్" అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ అయితే.. ఈ మూవీలో కింగ్ నాగార్జున ఒక్కరూ కాదు.. ఇద్దరూ కాదు.. ముగ్గురితో రొమాన్స్ చేయబోతున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరంటే?
నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున, రొమాంటిక్ హీరోగా, మాస్ హీరోగా, యాక్షన్ స్టార్‌గా అన్ని రకాల పాత్రల్లో తనదైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. "మనం", "ఘోస్ట్", "వైల్డ్ డాగ్" వంటి సినిమాల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న నాగార్జున, ఈ సారి కొత్త కాన్సెప్ట్‌తో సక్సెస్ సాధించాలనే సంకల్పంతో ఉన్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ మూవీగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.

తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ సినిమాలో మూడు హీరోయిన్‌లు నటించబోతున్నారు. అందులో సీనియర్ నటి టబు (Tabu) కీలక పాత్రలో కనిపించనున్నారు. గతంలో "నిన్నే పెళ్లాడతా", "వైల్డ్ డాగ్" వంటి సినిమాల్లో నాగార్జున-టబు జోడీకి ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు. మళ్లీ ఈ జంట స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అలాగే యువ నటి సుశ్మిత భట్ (Sushmitha Bhat) కూడా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఆమె ఇప్పటికే కన్నడ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో ఆమెకు పెద్ద అవకాశం అవుతుందని భావిస్తున్నారు. మూడో హీరోయిన్ పాత్ర కోసం ప్రస్తుతం మేకర్స్ ప్రముఖ నటీమణులతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆ వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.
నాగ్ - అనుష్క కాంబినేషన్ మళ్లీ?
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా అనుష్క శెట్టిను తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డాన్, రగడ, ఢమరుకం, సోగ్గాడే చిన్నినాయనా వంటి సినిమాల్లో నాగార్జున - అనుష్క జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ జంట మళ్లీ కలిస్తే, సినిమా మీద మరింత హైప్ పెరగడం ఖాయం. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
డ్యూయల్ రోల్‌లో నాగ్
నాగ్ 100 సినిమా రాజకీయ నేపథ్యంతో సాగనుందని, ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. ఒక పాత్రలో సాధారణ మనిషిగా, మరో పాత్రలో రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారని టాక్. ఈ కథలో యాక్షన్, డ్రామా, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ ట్రాక్ కూడా బలంగా ఉంటుందట. తాజాగా #King100 టీమ్ హైదరాబాద్‌లో ఒక చిన్న షెడ్యూల్ పూర్తి చేసింది. ఇందులో నాగార్జునతో పాటు టబు, సుశ్మిత భట్ పాల్గొన్నారు. నవంబర్ మధ్యలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు ప్లాన్లు చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు, కీలక ఎమోషనల్ సీక్వెన్స్‌లు చిత్రీకరించనున్నారు.
భారీ బడ్జెట్‌తో నిర్మాణం
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. టాప్ టెక్నీషియన్లు, అద్భుతమైన సెట్‌లు, స్టైలిష్ విజువల్స్‌తో సినిమా అత్యున్నత స్థాయిలో తెరకెక్కుతుందని యూనిట్ చెబుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్ కానుంది. వాస్తవానికి నాగార్జున 100వ సినిమా అని ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో #King100 హ్యాష్‌టాగ్ ట్రెండింగ్‌లో ఉంది. అభిమానులు "కింగ్ ఈజ్ బ్యాక్", "కింగ్100 ఆన్ ద్ వే" అంటూ ఫ్యాన్ పోస్టులు షేర్ చేస్తున్నారు. మాస్, క్లాస్ ప్రేక్షకుల రెండింటికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుందని యూనిట్ ధీమాగా చెబుతోంది.


Click it and Unblock the Notifications











