»   »  నాగార్జున కామెంట్స్‌ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం!

నాగార్జున కామెంట్స్‌ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. నాగార్జున స్వయంగా నటించి నిర్మించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' గత నెలలో సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. రూ. 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నాగార్జునకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది.

ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం రూ. 50 కోట్ల షేర్ సాధించింది. వసూలు చేసిన దాంట్లో సగం కంటే తక్కువ బడ్జెట్(రూ.20 కోట్ల కంటే తక్కువ) తో ఈ సినిమాను తీసాం. ఇలా మంచి లాభాలు వచ్చినపుడే నిజమైన సక్సెస్ అని అర్థం. రూ. 50 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాకు రూ. 50 కోట్ల వసూళ్లు వస్తే ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదు' అని వ్యాఖ్యానించారు.

Nagarjuna's 50 Cr Comment Irks NTR's Fans

అయితే నాగార్జున వ్యాఖ్యలు పరోక్షంగా జూ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమాను ఉద్దేశించినట్లు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగార్జున ఇలా మాట్లాడటం బాగోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ చేసి అనవసర వివాదాలను క్రియేట్ చేయొద్దని అంటున్నారు.

ఎన్టీఆర్ హీరోగా.... సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై రూ. 50 కోట్ల షేర్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం బడ్జెట్ 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో పోలిస్తే ఎక్కువ. దాదాపు రూ. 40 నుండి 45 కోట్ల పై చిలుకు బడ్జెట్ ఖర్చు పెట్టినట్లు సమాచారం.

English summary
Nagarjuna comments are now drawing a controversy, since some of them think, Nagarjuna has aimed the comment to taunt NTR's Nannaku Prematho. To people, who has no clue what the actor has said, let us put it clear for you. Talking about his joy over Soggade Chinni Nayana entering the élite club of 50 Cr, Nagarjuna stressed that the budget of the film is not even half of what it has collected; and hence is a true success. He pointed it out that there is no use for anyone, if a movie which is made with a budget of 50 Cr collects 50 Cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu