»   » లేటు వయస్సులో లేటెస్ట్ గా సిక్స్ పాక్స్ కోసం మన్మధుని పాట్లు...

లేటు వయస్సులో లేటెస్ట్ గా సిక్స్ పాక్స్ కోసం మన్మధుని పాట్లు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాక్స్, హీరోయిన్ లు జీరో సైజ్ లు చేసి ప్రేక్షకులను న్యూ లుక్స్ తో అలరిస్తున్నారు. వీరి బాటలోనే తమిళ హీరో సూర్య, విశాల్, టాలీవుడ్ లో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ చేసి ప్రేక్షకులను అలరించారు. తాజాగా హ్యాండ్ సమ్ హీరో నాగార్జున కూడా సిక్స్ ప్యాక్ చేయడానికి రెడీ అవుతున్నాడట. కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస రెడ్డి 'ఢమరుకం" అనే టైటిల్ తో నాగార్జునతో ఓ సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలోని పాత్రకు సిక్స్ ప్యాక్ అయితే యాప్ట్ గా ఉంటుందని భావించిన నాగ్ ప్రస్తుతం సిక్స్ ప్యాక్ చేసే పనిలో పడ్డాడట. ఇందుకోసం రోజూ వ్యాయామాలు, డైటింగ్ లు అంటూ తెగ కష్టపడిపోతున్నాడని తెలుస్తోంది. సిక్స్ ప్యాక్ లో నాగ్ మరింత ఆకట్టుకునే విధంగా ఉంటాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu