»   » 'బిందాస్' డైరక్టర్ తో నాగార్జున చిత్రం!?

'బిందాస్' డైరక్టర్ తో నాగార్జున చిత్రం!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు మనోజ్ తో 'బిందాస్' చిత్రాన్ని రూపొందించిన నూతన దర్శకుడు వీరూ పోట్లకి మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. నాగార్జున హీరోగా కామాక్షి కళా మూవీస్ వారు నిర్మించే చిత్రానికి సంభందించి చర్చలు జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్, కామాక్షి వారు కలిసి కంబైన్డ్ గా ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉంది. ఈ మేరకు కథా చర్చలు వీరూ పోట్లతో జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక అజయ్ భుయాన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా చేసే చిత్రం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. దానిని కామాక్షి కళా మూవీస్ పతాకంపైనే నిర్మించనున్నామని శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇక రెండు వారాలు క్రితం ఇదే బ్యానర్ కిరణ్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ కేడీ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుందీ ఈ చిత్రం.దాంతో వీరూ పోట్ల చిత్రం మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు నాగార్జున చేసిన సంతోషం చిత్రానికి వీరూపోట్ల మూల కథ అందించిన సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu