»   » రజనీ వస్తున్నాడనే నాగ్ వద్దనుకుంటున్నాడు

రజనీ వస్తున్నాడనే నాగ్ వద్దనుకుంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున, తమిళ నటుడు కార్తీల కలయికలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఊపిరి'. ఇటివలే రెగ్యులర్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను గతంలో ఫిబ్రవరిలో విడుదల చేయాలని ఫైనలైజ్ చేసారు.కాకపోతే ఇప్పుడు ట్ర్రేడ్ వర్గాల్లో అందుతున్న సమచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న టైమ్ కు కావటం కష్టమే అని తెలుస్తోంది.

జనవరిలో నాగార్జున తాజా చిత్రం సోగ్గాడు వస్తూండటంతో వేసవికి ఊపిరిని వాయిదా వేద్దాం అని అలోచనలో ఉన్నారు, కాకపోతే ఇప్పుడు మరోక చిక్కుని హీరో కార్తీ తెరమీదకు తెచ్చాడు.

Nagarujuna's latest Oopiri postponned?

ఊపిరి సినిమా సమ్మర్ లో రిలీజ్ చేయ్యలంటే, రజనీకాంత్ కబాలి తోనైనా, లేకపోతే అజిత్ కొత్త సినిమాతో పోటిపడాల్సి వస్తుంది. దీనితో వసూళ్ల పరంగా నష్టం వస్తుందేమోనని ఆలోచిస్తున్నారు. దీనితో విడుదల తేదీ మరింత ముందుకు వెళ్లే అవకాసం ఉందని తెలుస్తోంది. నిర్మాత గాకూడా ఆలోచించే నాగార్జున ఈ విషయం బలపరిచాడని చెప్పుకుంటున్నారు.

హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్' కి రీమేక్ గా ఊపిరి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క - అడవి శేష్ జంటగా కనిపించనున్నారు.

నాగార్జున మాట్లాడుతూ ''ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ వినలేదు. వంశీ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యా. మల్టీస్టారర్‌చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది''అన్నారు.

Nagarujuna's latest Oopiri postponned?

''నా సినిమాలన్నీ తెలుగులో అనువాద రూపంలో విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. నాగార్జునగారితో తెర పంచుకోవడం ఆనందంగా ఉంది''అని కార్తి తెలిపారు.

''నాగార్జున, కార్తి ఈ సినిమా చేస్తామని ముందుకు రావడంతో సగం విజయం సాధించినంత ఆనందంగా ఉంది. నేను రాసుకొన్న పాత్రలకు వాళ్లయితేనే పూర్తిగా న్యాయం చేస్తారనిపించింది''అన్నారు వంశీ పైడిపల్లి.

ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్‌, ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: శ్రీకర ప్రసాద్‌.

English summary
During summer as Rajinikanth's ‘Kabali’ and Ajith's new film is releasing and it will affect ‘Oopiri’ collections.
Please Wait while comments are loading...