Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Nagma: వివాదస్పదంగా నగ్మా ప్రేమాయణాలు? క్రికెటర్ నుంచి వివాహితుల దాకా!
అలనాటి బ్యూటిఫుల్ హీరోయిన్ నగ్మా అప్పట్లో ఒక ఊపు ఊపింది. 90వ దశకంలో గ్లామర్ క్వీన్ గా యూత్ ను అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా చిరింజీవితో ఘరానా మొగుడు, నాగార్జునతో అల్లరి అల్లుడు, రజనీకాంత్ భాషా సినిమాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సాంపాదించుకుంది. అనేక సినిమాల్లో హాట్ గా నటించడమే కాకుండా నగ్మా పర్సనల్ లైఫ్ కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉండేది. ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్న నగ్మా పెళ్లయిన వారితో ప్రేమాయణాలు నడిపిందని అప్పట్లో వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి..
90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది నగ్మా. టాలీవుడ్ తోపాటు తమిళం, హిందీ, భోజ్ పురి చిత్ర పరిశ్రమల్లో తనదైన గుర్తింపు పొందింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రహీరోలతో నటించింది. అలాగే రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. సినిమాల పరంగా స్టార్ గా మారిన నగ్మా.. మరోవైపు రాజకీయాల ద్వారా కూడా పేరు తెచ్చుకుంది.

భోజ్ పురి చిత్రాల్లో కూడా..
నగ్మా అసలు పేరు నందిత అరవింద్ మోరార్జీ. 1974లో ముస్లిం-హిందూ కుటుంబంలో జన్మించింది నగ్మా. తండ్రి జైసల్మేర్ రాజకుంటుబానికి చెందినవారు కాగా పలు కారణాలతో గుజరాత్, ముంబైకి షిప్ట్ అయింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నగ్మా తమిళం, హిందీతోపాటు భోజ్ పురి చిత్రాల్లో కూడా నటించి పాపులారిటీ దక్కించుకుంది. సినిమాలో అగ్ర హీరోలతో రొమాన్స్ చేసిన నగ్మా రియల్ లైఫ్ లోను స్టార్ హీరోలతో లవ్ ట్రాక్ నడిపినట్లు అప్పట్లో వార్తలు షికార్లు చేశాయి.

మాజీ క్రికెటర్ గంగూలీతో..
నగ్మా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా తిరుపతిలో ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత గంగూలీ భార్య డోనా కలుగజేసుకోవడంతో వీరిద్దరి రిలేషన్ కు ముగింపు పడినట్లు టాక్ వినిపించింది. అయితే అప్పట్లో గంగూలీ క్రికెట్ సరిగా ఆడనప్పుడు అతని ఫ్యాన్స్ నగ్మాను టార్గెట్ చేసేవారని సమాచారం.

రాధిక భర్త శరత్ కుమార్ తో..
సౌరవ్ గంగూలీ తర్వాత రాధిక భర్త అయిన శరత్ కుమార్ తో అఫైర్ నడిపిందని వార్తలు గుప్పుమన్నాయి. నగ్మాతో లవ్ ట్రాక్ కారణంగానే శరత్ కుమార్ కు అతని మొదటి భార్య విడాకులు ఇచ్చిందని రూమర్స్ వినిపించాయి. అనంతరం శరత్ కుమార్ తో నగ్మా బ్రేకప్ చెప్పింది. ఇక శరత్ కుమార్ కు రాధిక రెండో భార్య అన్న విషయం తెలిసిందే. తర్వాత భోజ్ పురి చిత్రాల్లో ఫోకస్ పెడుతున్న సమయంలో ఆ ఇండస్ట్రీ నటుడు రవి కిషన్ తో అనేక చిత్రాలు చేసింది నగ్మా.

రవి కిషన్ ఇంట్లో..
సినిమాల్లో రవి కిషిన్, నగ్మా కెమిస్ట్రీ బాగుందని అప్పట్లో ప్రశంసించేవారట. ఆ తర్వాత రీల్ లైఫ్ కెమిస్ట్రీ రియల్ లైఫ్ కెమిస్ట్రీగా మారిందని టాక్ వినిపించింది. నగ్మా, రవి కిషన్ ప్రేమ వార్తలపై భోజ్ పురి మీడియాలో తెగ వార్తలు హైలెట్ అయ్యేవట. దీంతో వాళ్లిద్దరి మధ్య రిలేషన్ గురించి రవి కిషన్ ఇంట్లో తెలుసని ఆయన చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. రవి కిషన్ భార్య ప్రీతి కూడా నగ్మాను బెస్ట్ ఫ్రెండ్ గా భావించేదని ఓ ఇంటర్వ్యూలో రవికిషన్ తెలిపాడట.

బహిరంగంగా వ్యతిరేకించిన నగ్మా..
అయితే నగ్మా విషయం తెలిసిన రవికిషన్ భార్య ప్రీతి అతనితో గొడవ పడిందని, తర్వాత నగ్మాకు రవికిషన్ బ్రేకప్ చెప్పాడని సమాచారం. రవి కిషన్ తర్వాత మరో భోజ్ పురి నటుడు మనోజ్ తివారితో ప్రేమాయణం సాగించిందని రూమర్స్ వచ్చాయి. అయితే అప్పట్లో రవి కిషన్, మనోజ్ తివారి మధ్య గట్టి పోటీ ఉండేదట. మనోజ్, నగ్మా అఫైర్ వార్తలను వారు బహిరంగంగానే ఖండించారని తెలుస్తోంది. అయితే నగ్మాపై వచ్చిన ఈ లవ్ ట్రాక్ రూమర్స్ అప్పట్లో వివాదాస్పదంగా మారాయి. కాగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లోకి ప్రవేశించిన నగ్మా ఉత్తరప్రదేశ్ లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.