»   » ఆ మళయాళ చిత్రం..నాగార్జున 'పయినం' కథ ఒక్కటే?

ఆ మళయాళ చిత్రం..నాగార్జున 'పయినం' కథ ఒక్కటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున, రాధామోహన్ (ఆకాశమంతా దర్శకుడు)కాంబినేషన్లో పయినం అనే చిత్రం రూపొందతోందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం కథ పూర్తిగా ఓ ప్లైట్ హైజాక్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. కాందహార్ లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం కథ తయారు చేసాడని చెప్తున్నారు. అయితే ఇదే పాయింటుతో ఆల్రెడీ మళయాళంలో మేజర్ రవి...అనే దర్శకుడు కాందహార్ అనే చిత్రం రూపొందించాడని..దానిని ఆధారం చేసుకుని ఈ కథనం అల్లాడని తమిళ చిత్ర పరిశ్రమలో వినపడుతోంది. కాందహార్ చిత్రంలో మోహన్ లాల్, అమితాబ్ బచ్చన్, సూర్య కీలకమైన పాత్రల్లో చేసారు. తమిళ,తెలుగు బాషల్లో రెడీ అయ్యే ఈ చిత్రం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఎయిర్ పోర్ట్ సెట్ వేస్తున్నారు. అలాగే నాగార్జున తన ఈ చిత్రం షూటింగ్ కోసం కేరళ బయలుదేరి వెళ్లారు. గురువారం నుంచి ఈ కొత్త చిత్రం షూటింగ్ అక్కడ మొదలైంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'పయనం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మరో టైటిల్ గా 'వాంటెడ్' పేరు కూడా ప్రచారంలో ఉంది. కెప్టెన్ దేవి శరన్ రాసిన ఫ్లైట్ ఇంటూ ఫియర్ అనే పుస్తకం ఆధారంగా ఈ కథ తయారుచేయబడింది. ఈ పుస్తకం 1998లో టెర్రరిస్టులు కాందహార్ ప్లేన్ ని హైజాక్ చేయటం..తదితర పరిణామాలు ఆధారంగా రాసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu