»   »  నమిత లేట్ నైట్ వ్యవహారం

నమిత లేట్ నైట్ వ్యవహారం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Namitha
తమిళ సినీ పరిశ్రమలో జనం నమిత గురించి మాట్లాడుకోవటంటే మహా సరదాగా ఫీలవుతూంటారు. అలాగే మీడియో కూడా ఆమె గురించే ఎప్పుడూ ఆరా తీస్తూ నమిత చుట్టూ తిరుగుతూంటుంది. అందులోను వారి ప్రవర్తనకు తగ్గట్టుగానే నమిత కూడా చిత్రంగా బిహేవ్ చేస్తూ ఎప్పుడూ అందరి నోట్లో నానుతూంటుంది. తాజాగా ఆమె చెన్నై అవుట్ స్కర్ట్స్ కి లేట్ నైట్స్ వెళుతోందోందని రూమర్ వచ్చింది. దాంతో కొందరు ఆవేశపరులు అర్జెంటుగా ఎంక్వైరీ కమీషన్ వేశారు. ఆరా తీసారు. అక్కడ ఒక ఇంటికే రెగ్యులర్ గా వెళ్ళి నాలుగైదు గంటలు గడుపుతోందని తేల్చిపాడేసారు.కాని అప్పుడు మరో సంశయం బయిలుదేరింది. సరే గాని ఆ ఇంటిలో ఎవరున్నారు.ఎవరని కలవటానికి పోతోంది అని..దాంతో మీడీయో కూడా ఎలర్టయి రక రకాల కధనాలు ప్రచురించి తమ క్రేజ్ పెంచుకుంది.

నమితని అడిగితే నర్మగర్భంగా నవ్వి ఊరుకుంటోంది. దాంతో అందరికీ ఇదో అంతర్జాతీయ సమస్యలా తోచింది. మళ్ళీ మీటింగులు వేసారు. మందు బాటిళ్ళు ఖాళీ అయ్యాయి కాని విషయం తేలలేదు. ఇక ఈ వ్యవహారం తీరేలా లేదని ...మళ్ళీ కొంత మంది మహానుభావులు పూనుకున్నారు. గూఢచారి పనిచేసి శ్రధ్ధగా వివరాలు రాబట్టారు. అందులో అందరూ నోరెళ్ళబెట్టే నిజం బయిటపడింది. ఆమె అక్కడ కెళ్ళేది ఈ మధ్య బాగ పాపులర్ అయిన సల్సా డాన్స్ కోసమట. రాత్రిళ్ళు వెళ్ళి నాలుగైదు గంటలు కష్టపడి ప్రాక్టీసు చేస్తేందిట. ఒళ్ళు తగ్గటానికో...సినిమా కోసమో ఇలా రహస్యంగా కష్టపుడుతోందిట. ఆమె కి ఆ డాన్సు మూలంగా యోదైనా ఒరిగిందో లేదో గాని చాలామంది మాత్రం టెన్షన్ తో బి.పి.లు పెంచుకున్నారుట. పత్రకలు సేల్స్ పెంచుకున్నాయట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X