For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చాలా కాలం తర్వాత అలాంటి మూవీలో బాలయ్య: హిట్ డైరెక్టర్ అదిరిపోయే ప్లాన్.. ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వేగంగా సినిమాలు చేసే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచే అదే పంథాను కొనసాగిస్తోన్న ఆయన.. జయాపజయాలను బేరీజు వేయకుండా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో చేస్తున్న 'అఖండ' పట్టాలపై ఉండగానే.. 'క్రాక్' దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమాను ప్రకటించాడు. ఈ మూవీని నిజ సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్నాడు సదరు దర్శకుడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  స్టైలిష్ లుక్ తో కవ్విస్తున్న లేటెస్ట్ మహేశ్వరి

  ‘అఖండ'గా వస్తున్న నందమూరి బాలకృష్ణ

  ‘అఖండ'గా వస్తున్న నందమూరి బాలకృష్ణ


  వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం గతంలో తనకు రెండు హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీనుతో ‘అఖండ' అనే సినిమా చేస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా, పూర్ణ హీరోయిన్లు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

   సౌతిండియా రికార్డును బద్దలు కొట్టిన హీరో

  సౌతిండియా రికార్డును బద్దలు కొట్టిన హీరో

  బాలయ్య - బోయపాటి కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన టైటిల్ రోర్ వీడియో ఉగాది కానుకగా విడుదలైంది. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియో ఎన్నో రికార్డులను తిరగరాసింది. అంతేకాదు, వేగంగా యాభై మిలియన్లు దాటిన టీజర్‌గా నిలిచింది. సీనియర్ హీరోల్లో సౌతిండియా రికార్డు బద్దలైంది.

  యువ దర్శకుడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్

  యువ దర్శకుడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్

  బోయపాటితో ‘అఖండ' సినిమా పట్టాలపై ఉండగానే.. యువ దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నందమూరి బాలయ్య. ఈ సినిమాను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా.. గోపీచంద్ ఈ ఏడాది సంక్రాంతికి రవితేజతో ‘క్రాక్' అనే సినిమాను రిలీజ్ చేశాడు. ఇది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

  గ్రంథాలయాల చుట్టూ తిరుగుతోన్న డైరెక్టర్

  గ్రంథాలయాల చుట్టూ తిరుగుతోన్న డైరెక్టర్

  ‘క్రాక్' మాదిరిగానే బాలకృష్ణతో చేయబోయే సినిమాను కూడా నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్నాడు గోపీచంద్ మలినేని. ఇందులో భాగంగానే తాజాగా అతడు తన సొంత జిల్లా ప్రకాశంకు వెళ్లాడు. అక్కడ ఉన్న జిల్లా లైబ్రెరీలో వేటపాలెం గ్రామానికి సంబంధించిన వందేళ్ల చరిత్ర గురించి పరిశోధనలు జరుపుతున్నాడు. దీనికి సంబంధించిన పిక్ కూడా బయటకు వచ్చింది.

  గ్యాప్ తర్వాత అలాంటి మూవీలో బాలయ్య

  గ్యాప్ తర్వాత అలాంటి మూవీలో బాలయ్య

  గోపీచంద్ మలినేనితో నందమూరి బాలకృష్ణ చేయబోయే సినిమా గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే రియల్ స్టోరీతో ఈ సినిమా రూపొందనుందని తెలిసిన తర్వాత ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి సమయంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇది ఫ్యాక్షన్ నేపథ్యంతో రాబోతుందట.

  Akhanda OTT రిలీజ్ పై చిత్ర బృందం రియాక్షన్ | Nandamuri Balakrishna
  డైరెక్టర్ సూపర్ ప్లాన్... పూనకాలు ఖాయం

  డైరెక్టర్ సూపర్ ప్లాన్... పూనకాలు ఖాయం

  నందమూరి బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలకు చిరునామాగా నిలిచారు. గతంలో ‘సమరసింహారెడ్డి', ‘నరసింహానాయుడు', ‘చెన్నకేశవరెడ్డి' తదితర చిత్రాలు చేశారు. వీటిలో ఎక్కువ శాతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు గోపీచంద్‌తో చేసే సినిమా పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కబోతుందట. ఇందులో బాలయ్య చాలా కాలం తర్వాత కోరమీసంతో కత్తి పట్టబోతున్నాడని తెలుస్తోంది.

  English summary
  Nandamuri Balakrishna, who will be portraying an IAS officer and an Aghora in Boyapati Sreenu’s film NBK 106 (BB3), is going to be seen in a powerful role in his next to be directed by Gopichand Malineni.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X