మొన్న రెహమాన్ కామెంట్స్.. నేడు ఇలా, ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న బాలయ్య!

అనుకోని విధంగా నందమూరి బాలకృష్ణ వార్తల్లో నిలిచారు. నిజానికి ఆయన ఒక తెలుగు న్యూస్ చానల్ కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వూ చర్చనీయాంశం అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడయిన ఏ ఆర్ రెహమాన్ ఎవరో తనకు తెలియదని అన్నట్టు మాట్లాడారు. అంతే కాక ఏదో పదేళ్లకు ఒకసారి హిట్ ఇస్తాడని, అలాంటి వాళ్ళకి ఆస్కార్ వస్తేనేమి ఇంకేం వస్తెనేమి అన్నట్టు మాట్లాడారు. అయితే ఈ వ్యవహారం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెహమాన్ ను అభిమానించే తమిళ్ నెటిజన్లు అయితే అసలు హూ ఈజ్ బాలకృష్ణ అంటూ ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా బాలయ్య తన అభిమానులకు షాక్ ఇచ్చే అవకాశాలూ ఉన్నాయి అంటున్నారు.

నిజానికి నందమూరి అభిమానులు ఈ రోజుల్లో క్లౌడ్ నైన్ లో ఉన్నారు. దర్శకుల ఎంపిక విషయంలో కాస్త చూసీ చూడనట్లు వ్యవహరిస్తాడు అనే పేరున్న నందమూరి బాలకృష్ణ అకస్మాత్తుగా మంచి లైనప్‌ను ప్రకటించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న ఆయన ఆ సినిమా పూర్తయిన తర్వాత మంచి మంచి దర్శకులతో సినిమాలు లైన్ లో పెట్టారు. గోపీచంద్ మలినేనితో ఇప్పటికే సినిమా ప్రకటించగా అనిల్ రావిపూడితో కూడా సినిమా ఖరారు అయ్యినట్టే . అయితే, అకస్మాత్తుగా, అతను దర్శకుడు రమణ తేజతో కలిసి మరో సినిమాను ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యువ దర్శకుడు అశ్వథామ అనే ఒక సినిమా చేయగా అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

nandamuri balakrishna fans are in tension over movie with Ramana teja

అయితే ఆయన ఇప్పుడు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తో కిన్నెరసాని అనే సినిమా చేస్తున్నాడు. ఇక మెగా అభిమానులకు సైతం ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి లేదు. అలాంటి కుర్ర దర్శకుడికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలయింది. మంచి లైనప్‌లో ఈ ప్రాజెక్ట్ జరగాలని బాలయ్య అభిమానులు కోరుకోవడం లేదు. ఇక అఖండ చివరి షెడ్యూల్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతోంది. ప్రతిదీ అనుకూలంగా మారితే, ఈ చిత్రం వినయక చవితి సందర్భంగా విడుదల కావచ్చు. ఆ తరువాత, బాలయ్య గోపిచంద్ మలినేనితో తన తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభిస్తాడు. మరి చూడాలి ఏం జరుగుతుందో అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X