Balakrishna అదిరే అప్‌డేట్ ఇదే: తండ్రికి కోసం ఈ సారి మళ్ళీ అలా.. ఫ్యాన్స్‌లో టెన్షన్!

నటసింహ నందమూరి బాలకృష్ణ కు తన తండ్రి అంటే ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన తండ్రి మీద ప్రేమను అన్ని సందర్భాల్లో ఆయన చాటి చెబుతూ ఉంటారు. బహుశా సినిమా చరిత్రలో లేని విధంగా తొలిసారి తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇక తన తండ్రి జయంతి సందర్భంగా మరోసారి ఆయన మీద ప్రేమను బాలయ్య చాటి చెప్పాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే ఆయన భీష్మ ఏకాదశి రోజున తండ్రిని అనుకరిస్తూ వేసిన భీష్ముడి గెటప్ విడుదల చేసి అభిమానులను అలరించారు.

ఇక తండ్రి జయంతి సందర్భంగా ఒక్కరోజు ముందు ఉదయం 8. 45 నిమిషాలకు కు ఒక అప్డేట్ ఉంటుందని ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది ఏమిటి అనే విషయం మీద అందరిలోనూ అనుమానాలు నెలకొని ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా బాలకృష్ణ తన తండ్రికి నివాళులు అర్పిస్తూ తన గానంతో చేసిన శ్రీ రామ దండకం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తండ్రి జయంతి రోజున ఉదయం 9.44 నిమిషాలకు శ్రీ రామ దండకం విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

Nandamuri Balakrishna To release Ramadandakam on NTR Jayanthi

దానికి సంబందించిన ప్రకటన 27వ తేదీ ఉదయం 8.45 నిమిషాలకు రాబోతుందట. శ్రీరామపాత్రలో ఎన్నో సార్లు కనిపించిన రామారావు ఫోటోలు, వాటికి బ్యాక్ గ్రౌండ్ లో బాలయ్య గానం చేసిన 'శ్రీరామదండకం' గద్యం నందమూరి అభిమానుల కోసం రిలీజ్ చేయనున్నారని చెబుతున్నారు.

అయితే గతంలో బాలయ్య రిలీజ్ చేసిన సొంత గొంతు పాటలు పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న నేపధ్యంలో బాలయ్య ఫ్యాన్స్ లో టెన్షన్ నెలకొంది. ఇక సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' అనే సినిమా చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X