For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వెరీ ఇంట్రెస్టింగ్: నందమూరి హీరో సినిమా స్టోరీ ఇదేనట.. మరీ ఇంత మంచితనమా.!

  By Manoj Kumar P
  |

  సంక్రాంతి సీజన్ అంటే తెలుగు రాష్ట్రాల్లో కోలహలం కనిపిస్తుంది. అలాగే, సినిమాల పరంగానూ ఎంతో హడావిడి నెలకొంటుంది. అందుకే పండుగ సీజన్‌లో సినిమాలు విడుదల చేయడానికి ఫిల్మ్ మేకర్లు పోటీ పడుతుంటారు. ఇప్పటి వరకు ప్రతి ఏడాది ఇలానే కొనసాగుతూ వస్తోంది. ఇక, ఈ సంక్రాంతికి కూడా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి పలు చిత్రాలు విడుదల కానున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ చిత్రం 'అల.. వైకుంఠపురములో..' వంటి బడా చిత్రాలతో కల్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' పోటీ పడనుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

   ఆ డైరెక్టరే కల్యాణ్‌ను మంచోడిని చేశాడు

  ఆ డైరెక్టరే కల్యాణ్‌ను మంచోడిని చేశాడు

  నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా'. సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ అధినేత ఉమేష్ గుప్త సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తు్నాడు.

  మూడు సినిమాలతో పోటీ.. ఆ నమ్మకంతోనే

  మూడు సినిమాలతో పోటీ.. ఆ నమ్మకంతోనే

  ‘ఎంత మంచివాడవురా' విడుదల అవడానికి ముందు మూడు బడా సినిమాలు రానున్నాయి. అందులో ‘సరిలేరు నీకెవ్వరు', ‘అల.. వైకుంఠపురములో..'తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘దర్బార్' కూడా విడుదల కానుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత అంటే జనవరి 15న కల్యాణ్ రామ్ సినిమా వస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

   అన్న కోసం తారక్ వస్తున్నాడు

  అన్న కోసం తారక్ వస్తున్నాడు

  రెండు బడా సినిమాలు వస్తుండడంతో ‘ఎంత మంచివాడవురా' అసలు సంక్రాంతి రాదని చాలా మంది అన్నారు. కానీ, చిత్ర యూనిట్ మాత్రం జనవరి 15న వస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనవరి మొదటి వారంలో జరిగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతడు వస్తున్నాడని టాక్.

   ఆ సినిమాకు రీమేక్‌గా వస్తోంది

  ఆ సినిమాకు రీమేక్‌గా వస్తోంది

  ‘ఎంత మంచివాడ‌వురా' గుజ‌రాతీలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘ఆక్సీజ‌న్‌' అనే మూవీకి రీమేక్‌గా తెర‌కెక్కుతుంద‌ని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, దీనిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా, ఫీల్‌ను మిస్‌ చేయకుండా స‌తీష్ వేగ‌శ్న తెర‌కెక్కిస్తున్నాడని అంటున్నారు. అయితే, చిత్ర యూనిట్ మాత్రం కొంత భాగాన్నే తీసుకున్నామని అంటోంది.

  ‘ఎంత మంచివాడవురా' కథ లీక్

  ‘ఎంత మంచివాడవురా' కథ లీక్

  కల్యాణ్ రామ్ సినిమా కథ లీక్ అయిందంటూ ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఇందులో హీరో మంచివాడిగా పేరు తెచ్చుకుంటాడట. ఆ మంచితనంతోనే అతడికి తెలియకుండానే విలన్ గ్యాంగ్‌కు కూడా హెల్ప్ చేస్తాడట. అది హీరో కుటుంబానికే హాని కలిగిస్తుందట. తర్వాత విలన్ల నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేదే చిత్ర కథ అని టాక్.

  English summary
  Entha Manchivaadavuraa is an upcoming Indian Telugu-language action drama film directed by Satish Vegesna. An official remake of the Gujarati-language film Oxygen, it stars Kalyan Ram and Mehreen Pirzada in the lead roles, with the music composed by Gopi Sundar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X