»   »  నందమూరి-మెగా హీరోలను కలిపే భాధ్యత చౌదరిదే

నందమూరి-మెగా హీరోలను కలిపే భాధ్యత చౌదరిదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి ,మెగా హీరోల కాంబినేషన్ ..వినగానే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఈ కాంబినేషన్ ని సెట్ చేసే భాధ్యత ఎఎస్ రవి కుమార్ చౌదరి తీసుకున్నట్లు చెప్తున్నారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన హీరోలిద్దరినీ ఒకే తాటిపై తెచ్చి సినిమా చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఇంతకీ ఎవరా హీరోలు అంటే...మెగా క్యాంప్ నుంచి సాయి ధరమ్ తేజ, నందమూరి క్యాంప్ నుంచి కళ్యాణ్ రామ్ అని తెలుస్తోంది. గతంలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో కాస్ట్ బయాస్డ్ కామెంట్స్ చేసాడని రిమార్క్ తెచ్చకున్న రవికుమార్ చౌదరి నుంచి ఈ కాంబినేషన్ ఊహించటం ఆశ్చర్యమే అంటున్నారు.

Nandamuri – Mega Heroes Multi-starrer?

ఇక రవికుమార్ చౌదరి...గ్యాప్ తర్వాత సాయి ధరమ్ తేజ తో పిల్లా నువ్వు లేని జీవితం అంటూ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చారు. అయితే వెంటనే గోపిచంద్ తో సౌఖ్యం అనే టైటిల్ తో చిత్రం చేసి డిజాస్టర్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

రవికుమార్ చౌదరి కు డేట్స్ ఇవ్వటానికి సాయి ధరమ్ తేజ వెంటనే ముందుకు వచ్చాడని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ సైతం ఈ కొత్త కాంబినేషన్ పట్ల చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. మరి వీళ్లద్దరి మెప్పించటానికి ఏం కథ రెడీ చేసాడో చూడాలి.

ఇంతకీ ఈ ఇంట్రస్టింగ్ కాంబినేషన్ ని ప్రొడ్యూస్ చేసేది మాత్రం కె.ఎస్ రామారావు అని తెలుస్తోంది. తన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మిస్తాడని అంటున్నారు. ఆయన నిర్మాత కావటం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే అంశం.

English summary
AS Ravi Kumar Chowdary is planning to bring two family heroes on single platform.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu