For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాని సినిమాకి అనుకోని కష్టం..రిస్క్ చేసినా సరే.. ఒక్క రాత్రిలో కోట్ల రూపాయల నష్టం.. !

  |

  తెలుగులో మినిమమ్ గ్యారంటీ హీరోగా నానికి పేరుంది. అందుకే తనకు తగ్గ కథలు ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు ఆయన. గత ఏడాది వీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా నిరాశపరిచింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ఒక సినిమాకు సంబంధించిన ఆసక్తికర ఒక బాధాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  నాని వరుస సినిమాలు

  నాని వరుస సినిమాలు


  నేచురల్ స్టార్ నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమాలో నటించారు. నిజానికి ఈ సినిమా గత నెలలో 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూసివేత గురించి ముందే ఊహించిన సినిమా యూనిట్ సినిమాని వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయం త్వరలో ప్రకటిస్తామని కూడా నాని వాయిదా ప్రకటనలో చెప్పుకొచ్చాడు. అది ఎప్పటికి వస్తుందనేది క్లారిటీ లేదు. ఈ సినిమాతో పాటు ఆయన శ్యామ్ సింగరాయ్ అనే సినిమా కూడా చేస్తున్నారు.

   ఏకంగా ముగ్గురు హీరోయిన్స్

  ఏకంగా ముగ్గురు హీరోయిన్స్


  గతంలో విజయ్ దేవరకొండతో టాక్సీవాలా అనే సినిమా తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వెంకట్ బోయినపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఒక పిరియాడిక్ సినిమా అనే ప్రచారం కూడా జరుగుతోంది ఇక ఈ సినిమాలో నాని సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.

  ఈ ఏడాది చివర్లో రిలీజ్

  ఈ ఏడాది చివర్లో రిలీజ్


  సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే కీలక పాత్రలలో బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా నటిస్తున్నారు. పరిస్థితులు అన్నీ బాగుంటే కనుక ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

  హైదరాబాద్ శివార్లలో భారీ సెట్

  హైదరాబాద్ శివార్లలో భారీ సెట్


  నిజానికి పూర్తిగా కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు పశ్చిమ బెంగాల్ లో జరిపారు. అయితే అక్కడ ఎన్నికల నేపథ్యంలో షూటింగ్ కు అంతరాయం కలగడంతో యూనిట్ అంతా తిరిగి వచ్చారు. ఇక. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఆరున్నర కోట్ల రూపాయలు పెట్టి కలకత్తాలోని కాళీ మాత గుడితో సహా కొన్ని వీధులను స్పురించే విధంగా సెట్ నిర్మించారు. లాక్ డౌన్ ముందు దాకా ఈ సెట్ లో షూటింగ్ కూడా జరిగింది.

  Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
  వర్షానికి భారీ డ్యామేజ్

  వర్షానికి భారీ డ్యామేజ్


  అయితే ఈ సినిమా కోసం నిర్మించిన ఆ భారీ బడ్జెట్ సెట్ ఇప్పుడు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో రెండు రోజుల నుంచి రాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సెట్ నాశనం అయినట్టు తెలుస్తోంది. ఇలాంటివి ఏదైనా జరుగుతుందని భావించి నాని రిస్క్ చేసి కూడా షూట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెట్ పునర్నిర్మించాలంటే దాదాపు రెండు కోట్ల ఖర్చు అవుతుందట.

  English summary
  As we all know nani is busy with Shyam Singha Roy now. Makers of the film erected a set of Kolkata along with Kaali temple in the outskirts of Hyderabad and it costed Rs 6.5 crores for the makers. With the second wave of coronavirus alert and Lock down in telangana film shoot halted. But The latest update is that the erected set was severely damaged with the recent rains and heavy wind in Hyderabad. The makers will now suffer a big loss becasue shoot in the set is still pending.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X