»   »  హైఫీవర్ లో కూడా ఎన్టీఆర్

హైఫీవర్ లో కూడా ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : డెడికేషన్, వృత్తిపట్ల నిబద్దత ఎన్టీఆర్ కు ఎక్కువ అంటారు. అందుకేనేమో ఆయన హై ఫీవర్ తో బాధపడుతున్నా అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేసి ,విడుదలచేయాలని రెస్ట్ తీసుకోకుండా బిజీ షెడ్యూల్ లో ఉంటున్నారు.

ఎన్టీఆర్ నటించిన లేటిస్ట్ సినిమా 'నాన్నకు ప్రేమతో'. సంక్రాంతి రేసుకోసం సిద్దమవుతున్న ఈ సినిమాను రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


శర వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న నాన్నకు ప్రేమతో డబ్బింగ్ లో హైఫీవర్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొన్నారు. జనవరి 13న రిలీజ్ కు సిద్ద పడుతున్న ఈ సినిమాకోసం టీం అంతా చాలా కష్టపడుతున్నారు.


 Nannaku Prematho: NTR dubbing with high fever

ఎన్టీఆర్ తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో' ఆడియో ఈ మధ్యనే రిలిజ్ అయ్యి అందరి మన్ననలూ పొందుతోంది. మరో ప్రక్క ..., ఆడియో పాటు విడుదలైన దియోటర్ ట్రైలర్ కి మంచి స్పందన వస్తొంది.


ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లియస్ట్‌ చిత్రంగా 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా లావిష్‌గా చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
NTR is running high fever but is still dubbing for his character in Nannaku Prematho.
Please Wait while comments are loading...