»   »  'నాన్నకు ప్రేమతో' సంక్రాంతికి కాదు..మరి?

'నాన్నకు ప్రేమతో' సంక్రాంతికి కాదు..మరి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారాబాద్ :ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. ఈ చిత్రం సంక్రాతికి రోజు విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సంక్రాంతికి కాకుండా జనవరి 22న కానీ, ఫిబ్రవరి మొదటి వారంలోకానీ విడుదల అయ్యే అవకాసం ఉందని సమాచారం.

గతంలో టెంపర్ చిత్రం సైతం ఇలాగే ముందు సంక్రాతికి ప్లాన్ చేసి తర్వాత పిబ్రవరిలో విడుదల చేసి సక్సెస్ చేసారు. సంక్రాంతికి బాలకృష్ణ చిత్రం డిక్టేటర్ ఉండటంతో వెనక్కి వెళ్లినట్లు ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు..పోస్ట్ ప్రొడక్షన్ లేటు అయ్యేటట్లు ఉండటంతో వాయిదా వేస్తున్నారు కొందరు అంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఏదీ లేదు.

చిత్రం బిజినెస్ విషయానికి వస్తే..ఈ చిత్రం మూడు ఏరియాలకు 31 కోట్లు బిజినెస్ జరిగి రికార్డ్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' తన 25వ సినిమా అవ్వడం, దీనికి క్రేజీ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వం తోడవ్వడంతో దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అత్యంత ప్రజాదరన కలిగిన టీసర్ ఈ సినిమాకి కావలసినంత ఊతం లభించేలా చేసింది..అందుకే బయ్యర్లను బాగా ఆకర్షించిందీ చిత్రం..

Nannaku Prematho out of Sankranthi Race

ఈ చిత్రం నైజాం రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ రూ.16 కోట్లకు సొంతం చేసుకున్నారు. అలాగే ఓవర్సీస్ లో ఈ సినిమా రూ. 7.10 కోట్లకు అమ్ముడై ఆల్ టైం రికార్డు అందుకుంది. ఇక సీడెడ్ లో ఎన్టీఆర్ కేరీర్ లోనే హయ్యస్ట్ గా రూ 8.45 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూడు ఏరియాల టోటల్ బిజినెస్ రూ.31 కోట్ల మార్క్ కు చేరింది.

దాంతో మిగతా ఏరియాల్లో కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ జరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మిగిలిన కోస్తా, కర్ణాటక, చెన్నై బిజినెస్ తో కలుపుకుంటే రూ.60 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ జరుగుతుందని అంటున్నారు.

English summary
NTR's much awaited flick Nannaku Prematho will see lights either on January 22nd or in February.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu