»   » గవర్నమెంటుతో కుమ్మక్కు: నారా రోహిత్ మీద షాకింగ్ రూమర్స్!

గవర్నమెంటుతో కుమ్మక్కు: నారా రోహిత్ మీద షాకింగ్ రూమర్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరో నారా రోహిత్ మీద కొన్ని షాకింగ్ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నారా రోహిత్ చెలరేగి పోతున్నాడని, అందుకే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడని, పెద్దనాన్న చంద్రబాబు అండతో గవర్నమెంటు ద్వారా లబ్ది పొందడానికే నారా రోమిత్ ఇంత స్పీడుగా సినిమాలు చేస్తున్నారనే కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.

దీన్ని కొందరు 'క్విడ్ ప్రో కో' అంటూ అభిర్ణిస్తుండటం గమనార్హం. అయితే ఈ వార్తలపై స్పందించినట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఆధారంలేని రూమర్స్ గా కొట్టిపారేసినట్లు సమాచారం. అలాంటిదేమైనా ఉంటే తాను పెద్ద డైరెక్టర్లతో, భారీ బడ్జెట్ తో సినిమా చేసే వాడిని, చిన్న డైరెక్టర్లతో చిన్న సినిమాలు చేసే వాడిని కాదని నారా రోహిత్ స్పష్టం చేసినట్లు సమాచారం. తనతో సినిమాతో నిర్మిస్తున్న వారు వివిధ పార్టీలకు చెందిన వారు ఉన్నారని నారా రోహిత్ తేల్చి చెప్పారట.

'రాజా చెయ్యి వేస్తే' ట్రైలర్‌కు రెస్పాన్స్ కేక!

Nara Rohit reaction on Quid Pro Quo rumors!

నారా రోహిత్ సినిమాల విషయానికొస్తే.... ఆయన నటించిన 'సావిత్రి' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. త్వరలో నారా రోహిత్ 'రాజా చెయ్యి వేస్తే' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది.

ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. సాయికార్తీక్ సంగీతం అందించారు. ఇటీవలే బాలయ్య చేతుల మీదుగా ఆడియో రిలీజైంది. ట్రైలర్ కు రెస్పాన్స్ బావుంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటం, హీరో నారా రోహిత్ తో సమానంగా తారకరత్న విలనిజం ఉండటంతో మరింత ఆసక్తిని రేపుతోంది.

మురారి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తనదైన శైలితో రాణిస్తున్న సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాటోగ్రఫీ హైలెట్ అవుతుందని స్పష్టమవుతోంది. ఏప్రిల్ 29న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Nara Rohit reaction on Quid Pro Quo deal with TDP rumors. Nara Rohit denies any such deal and says if that is the case, he would have done films with big directors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu