»   » మోడీకి నాగార్జున జై కొట్టడం వెనక....రహస్యం ఏమిటి?

మోడీకి నాగార్జున జై కొట్టడం వెనక....రహస్యం ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు నాగార్జున బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని సోమవారం కలిసారు. మోడీకి తన మద్దతు ప్రకటించారు. తాను పొలిటీషియన్‌ను కాదని, తానుగానీ...తన భార్య అమల కానీ రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేసారు. గుజరాత్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసిన మోడీ ప్రధాని అయితే దేశ ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ లాంటి ఖరీదైన ఏరియాలో ఉంటున్న తానే రోజు మూడు గంటల కరెంటు కోతను అనుభవిస్తున్నానని......గుజరాత్‌లో మోడీ 24 గంటల కరెంటు అందేలా అభివృద్ధి పరచడంతో పాటు అన్ని ఊర్లలోనూ ఇంటర్నెట్, వైఫ్ లాంటి సౌకర్యాలు కల్పించారని, గుజరాత్‌ను అన్ని రంగాల్లోనూ అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చి దిద్దారని తెలిపారు.

Narendra Modiji will be the next PM: Nagarjuna

అయితే నాగార్జున మోడీకి జై కొట్టడం వెనక పెద్ద ప్లానే ఉందనే ప్రచారం సాగుతోంది. నాగార్జునను అన్నపూర్ణ స్టూడియో భూముల విషయంలోనూ, ఆయన చెందిన N కన్వెన్సన్ సెంటర్ విషయంలో, అదే విధంగా ఆయన భార్య అమల నిర్వహిస్తున్న బ్లూక్రాస్ సంస్థ కోసం ప్రభుత్వం జూబ్లీహిల్స్ ప్రాంతంలో కేటాయించిన భూమి విషయంలో కొన్ని పార్టీల నాయకులు నాగార్జునను ఇబ్బంది పెడుతున్నారని టాక్.

మోడీ లాంటి వారి సపోర్టు ఉంటే....భవిష్యత్తులో సదరు పార్టీల నాయకుల నుండి ఇబ్బంది ఉండక పోవచ్చని నాగార్జున భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు నాయకులు నాగార్జునను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ గుసగుసల్లో నిజమెంతో? తెలియదు కానీ, నాగార్జున అభిమానులు మాత్రం మోడీకి జై కొట్టడంపై ఆనందంగానే ఉన్నారని తెలుస్తోంది.

English summary
Tollywood star Nagarjuna met Narendra Modi in Gandhinagar today amid speculation that he might join the BJP. After the meeting, Nagarjuna, 54, said that he was "inspired by Modiji and he will be the next PM."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu