»   » నిర్మాతకు షాకిచ్చిన నయనతార.. ఆ డబ్బు ఇస్తేనే..

నిర్మాతకు షాకిచ్చిన నయనతార.. ఆ డబ్బు ఇస్తేనే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

యువ హీరో గోపిచంద్, అందాల నయనతార నటించిన ఆరడుగుల బుల్లెట్ చిత్రానికి మొదటి నుంచి ఏదో రకమైన సమస్యలే. గత మూడేళ్లుగా ఆ సినిమా నత్తనడకన సాగుతున్నది. అయితే తాజాగా అన్ని ఇబ్బందులను దాటుకుంటూ విడుదల వరకు వచ్చింది. ఈ చిత్రాన్ని జూన్ 9వ తేదీన విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధం చేశారు. కానీ ఈ సినిమా ప్రమోషన్ గురించి ఎక్కడా వినిపించడం లేదు. అయితే చిత్ర ప్రమోషన్ చేపట్టాలని నిర్ణయించారు. అందుకు నయనతారను రావాలని కోరిన నిర్మాతలకు ఆమె చెప్పిన సమాధానంతో వారు కంగుతిన్నారట.

భారీ మొత్తం డిమాండ్

భారీ మొత్తం డిమాండ్

ఆరడుగల బుల్లెట్ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఈ ప్రాజెక్ట్ నలిగిపోయింది. మీరు ప్రమోషన్స్‌కు వచ్చి సహకరిస్తే కొంత గట్టెక్కే పరిస్థితి ఉంటుంది అని ఆమెను నిర్మాతలు కోరారట. అయితే వారం రోజులపాటు టీవీ షోలకు, మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తాను. కాకపోతే నేను డిమాండ్ చేసే మొత్తాన్ని సమర్పించాలని కోరిందట.

వారం రోజులకు ముట్టజెప్పాల్సిందే..

వారం రోజులకు ముట్టజెప్పాల్సిందే..

హీరో గోపిచంద్‌తో కలిసి సినిమా ప్రమోషన్‌ను వారంరోజులపాటు చేస్తాను. టీవీలకు, ఇతర మీడియాకు ఇంటర్వ్యూలో ఇస్తాను. కాకపోతే రూ.30 లక్షలు, వసతి, ప్రయాణ ఏర్పాట్లు చూసుకోవాలని డిమాండ్ చేసిందట.

ఇతర షెడ్యూల్స్‌కు ప్రాబ్లం

ఇతర షెడ్యూల్స్‌కు ప్రాబ్లం

నిర్మాత కష్టాల్లో వున్నాడని చెప్పి కాస్త కరుణించమని నయనతారను కోరినా దేనకదే అని స్పష్టం చేసింది. తాను ఈ చిత్రం ప్రచారం కోసం వచ్చినట్టయితే తన తమిళ చిత్రాల షెడ్యూల్స్‌ దెబ్బతింటాయి. డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇచ్చినట్టయితే వస్తాను లేదంటే లేదు అని తేల్చేసిందట. ఆమెకి ముప్పయ్‌ లక్షలు ఇవ్వగలిగితే ఆ డబ్బు పేపర్‌, టీవీ యాడ్స్‌ మీదే ఖర్చు పెట్టుకోవచ్చునని నయనపై ఆశలు వదిలేసుకున్నారట.

ఓపెనింగ్స్ కష్టమేనట..

ఓపెనింగ్స్ కష్టమేనట..

ఆరడుగుల బుల్లెట్ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం, వక్కంత వంశీ కథను అందించారు. ఇలాంటి గొప్ప పేర్లున ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓపెనింగ్స్ రావడం కష్టమే అంటున్నాయి సినీ వర్గాలు. ఈ చిత్రాన్ని తాండ్ర రమేశ్ నిర్మించాడు.

English summary
Aaradugula Bullet is a 2017 Telugu action film, produced by Thandra Ramesh on Jaya Balaji Real Media banner and directed by B. Gopal. Starring Gopichand, Nayantara in the lead roles and music composed by Mani Sharma. This project is delayed at least three years. Recently producer approached Nayantara for promotion. but Nayanatara demanded extra Rs.30 Lakhs for one week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu