»   » చిరంజీవితో చేయమంటే...రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తోందట?

చిరంజీవితో చేయమంటే...రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తోందట?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా మొదలు పెట్టేందుకు రంగం సిద్దమైన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవికి నయనతార అయితే సరిగ్గా సూటవుతుందనే భావనలో ఉన్నారని సమాచారం. ఈ మేరకు నయనతారను సంప్రదించగా రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి అంత మొత్తం ఇచ్చి ఆమెను తీసుకుంటారా? లేక మరొకరి కోసం చూస్తారా? అనేది తేలాలి.

ఇక ఈ చిత్రం ఆగస్టులో ప్రారంభం కాబోతోంది. ఇటీవల చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేసారు. 150వ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు, ఆగస్టులో సినిమా ప్రారంభం అవుతుందని అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడు రామ్ చరణ్ తో పాటు బండ్ల గణేష్ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటారని తెలిపారు. ఆగస్టులో అంటే చిరంజీవి జన్మదినం రోజు ప్రారంభం అవుతుందని స్పష్టం అవుతోంది. 150వ సినిమాపై స్వయంగా చిరంజీవి స్పందించడంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

Nayantara Demanded Rs 3 Cr for Chiranjeevi's 150th Film?

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈచిత్రానికి ప్రస్తుతం ‘ఆటోజానీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మించబోతున్నారు. సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ... ఈ స్టోరీ నేను ఇప్పటికే విన్నాను. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇది పూర్తి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ అయిన కథ అని రాంచరణ్ తెలిపారు. ఇలాంటి చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం దక్కినా అదృష్టంగానే భావిస్తానని చరణ్ చెప్పుకొచ్చాడు.

సినిమాను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక బృందం ఉందని, నిర్మాతగా తన మొదటి సినిమా చేయడానికి ఎంతోమంది ప్రెజర్ ఫీలయ్యారని, కానీ పూరీ జగన్నాథ్ ఒక్కడే కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పాడు. పూరీకి ఈ కథమీద మంచి పట్టుందని, టోటల్ గా‌ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అవుతుందని చెర్రీ అన్నాడు.

English summary
If grapevine is to be believed, buxom beauty Nayantara reportedly demanded whopping Rs 3 Crore to pair up with Chiranjeevi in his comeback film.
Please Wait while comments are loading...