»   » రాజమౌళి 'మర్యాదరామన్న' లో ఆ స్టార్ హీరోయిన్ !?

రాజమౌళి 'మర్యాదరామన్న' లో ఆ స్టార్ హీరోయిన్ !?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌళి, సునీల్ కాంబినేషన్లో రూపొందుతున్న 'మర్యాదరామన్న' చిత్రంలో నయనతార ఐటం సాంగ్ చేస్తోందని తెలుస్తోంది. ఫ్యాక్షన్ నేపధ్యంలో తయారవుతున్న ఈ కామిడిలో ఈ పాట మంచి కిక్ ఇస్తుందని భావిస్తున్నారు. ఇంతకుముందు కూడా రాజమౌళి తన సినిమాల్లో ఇలా ఐటం సాంగ్ లు పెట్టి క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఇక నయనతార ఇలా స్పెషల్ సాంగ్ చేస్తూంటే...సదా హీరోయిన్‌గా నటిస్తున్న ఓ కన్నడ చిత్రంలో ఇలియానా స్పెషల్ సాంగ్ చేస్తోంది. మరో ప్రక్క శ్రియ..పులి చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. ఇలా హీరోయిన్స్ తమ అందాలను ఆరబోస్తూ చేస్తున్న ఐటం సాంగ్స్ కు బాగానే డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి.

అలాగే ఈ చిత్రంలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగానే ఉండబోతోందని సమాచారం. మరీ మగధీర రేంజిలో గ్రాఫిక్స్ లేకపోయినా 'మర్యాద రామన్న' కి గ్రాఫిక్స్ బడ్జెట్ ఎక్కువే ఖర్చుపెడుతున్నారని అంతటా వినపడుతోంది. కామిడీ సినిమాకి గ్రాఫిక్స్ ఏమిటనుకున్నా రాజమౌళి తాను అనుకున్నది తెరకెక్కించటానికి మాత్రం వెనకాడటం లేదని, ఈ చిత్రం కూడా విజువల్ ట్రీట్ లా ఉండాలి అని భావించి చేస్తున్నాడని చెప్తున్నారు. మరో ప్రక్క రాజమౌళి రెగ్యులర్ తన చేసే సినిమాలకు భిన్నమైనదని, స్లాప్ స్టిక్ కామిడీ ఉండదని, తన వరకూ ఓ ప్రయోగం అని అంటున్నారు. సలోని హీరోయిన్ గా చేసే ఈ చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కామిడీగా జరుగుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu