»   » నయా స్ట్రాటజీ :డైరక్టర్ కి నయనతార కండీషన్

నయా స్ట్రాటజీ :డైరక్టర్ కి నయనతార కండీషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నయనతార సెకండ్ ఇన్నింగ్స్ చాలా జోరుగా సాగుతోంది. ఇప్పుడామె తన నేటివ్ ప్లేస్ మళయాళంలో భాస్కర్ ది రాస్కెల్ అనే చిత్రం చేస్తోంది. ఈ చిత్రం దర్శకుడు మరెవరో కాదు...బాడీగార్డ్, హిట్లర్ వంటి సూపర్ హిట్ చిత్రాల మళయాళ దర్శకుడు సిద్దిక్. అయితే ఇప్పుడామె ఈ దర్శకుడుతో చిత్రం ఒప్పుకునేటప్పుడు ఓ కండిషన్ పెట్టిందట. అదేమిటంటే...ఈ చిత్రం రేపు హిట్టై..వేరే ఏ భాషలోకి రీమేక్ అయినా తననే హీరోయిన్ గా తీసుకోవాలని..దానికి సంతోషంగా ఒప్పుకున్న సిద్దిక్ ఈ ప్రాజెక్టుని ఫినిష్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జెడి చక్రవర్తి కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పూర్తి వివరాల్లోకి వెళితే...

మలయాళంలో సిద్ధిక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'భాస్కర్‌ ద రాస్కల్‌'లో నయనతార నటించింది. దర్శకుడు తొలుత ఆఫర్‌ ఇచ్చినప్పుడు ఆమె ముఖ్య షరతు విధించిందట. ఆ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో పునర్నిర్మిస్తే తననే కథానాయికగా ఎంపిక చేయాలని చెప్పింది. అంతగా డిమాండ్‌ చేయాల్సిన అవసరం ఏముందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.

మలయాళంలో 'బాడీ గార్డ్‌'ను సిద్ధిక్‌ తెరకెక్కించినప్పుడు హీరోయిన్‌గా నయనతార నటించింది. తమిళంలో విజయ్‌ హీరోగా 'కావలన్‌' పేరిట దాన్ని పునర్నిర్మించారు. అందులోనూ నయనతారకే అవకాశం వచ్చింది. ఆమె నిరాకరించడంతో అసిన్‌ దక్కించుకుంది. హిందీలోనూ ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ చిత్రాల్లో నటించలేకపోయానన్న బాధ నయనతారను వెంటాడిందట.

Nayantara will be heroine in all versions

అందుకే 'భాస్కర్‌ ద రాస్కల్‌'లో నటించడానికి ఆ షరతు విధించినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. మలయాళ చిత్రం ఇప్పటికే పూర్తవగా.. త్వరలో తమిళంలో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హీరో ఎవరనే విషయం ఇంకా తేలలేదు.

నయనతార పరిశ్రమలో అడుగుపెట్టి దశాబ్దం దాటింది. అయినా చేతిలో ‘ఇదు నమ్మ ఆళు', ‘నన్బెండా', ‘తని ఒరువన్‌', ‘మాస్‌', ‘భాస్కర్‌ ది రాస్కెల్‌' వంటి సినిమాలున్నాయి. 2003లో ‘మనసినక్కరె' సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు నయనతారకు పెద్దగా కలలేవీ లేవు. నటిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలనుకుంది. కానీ తాను నటిస్తున్న ఒక్కో సినిమా విడుదలై విజయం సాధిస్తున్నకొద్దీ సినిమాలపై ఆసక్తి పెరిగింది. మంచి స్ర్కిప్టులు ఎంపిక చేసుకోవడం మొదలుపెట్టింది.

‘‘భారతీయ నటీమణులు, మరీ ముఖ్యంగా దక్షిణాది నటీమణులు తెరపై తప్పకుండా అందంగా కనిపించాలి. కేవలం కురచ దుస్తుల్లోనే అందం ఉంటుందనుకుంటే పొరపాటే. నిండైన వసా్త్రల్లోనూ అందంగానే కనిపిస్తాం. ఈ విషయాన్ని నేను కెరీర్‌ ఆది నుంచీ నమ్ముతాను'' అని చెబుతుందీ చిన్నది.

శింబుతో ఒకసారి, ప్రభుదేవాతో మరోసారి ప్రేమలో పడి వైఫల్యాన్ని చవిచూసినప్పుడు కూడా ఈ కేరళ కుట్టి మనోనిబ్బరంతోనే వ్యవహరించింది. ‘‘కొన్ని బంధాలు ఎందుకు ఏర్పడతాయో, ఎందుకు విడిపోతాయో చెప్పలేం. కాకపోతే ఆ సమయంలో ఆత్మస్థైర్యంతో వ్యవహరించాలి. జీవితం అత్యంత విలువైంది. అందుకే ఇతరుల గురించి ఆలోచించడం మానేయాలి. అప్పుడే జీవితమనే నావ ముందుకు సాగుతుంది'' అని వివరించింది.

‘శ్రీరామరాజ్యం' తర్వాత నయన్‌ సినిమాలకు దూరమవుతుందనే వార్తలు వినిపించాయి. కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ‘‘ఇప్పట్లో దృష్టి మొత్తం కెరీర్‌ మీదే. ఇంకే విషయాలనూ ఆలోచించట్లేదు'' అని స్పష్టం చేసిందీ సుందరి.

‘‘ఎందుకు దేన్నీ పెద్దగా పట్టించుకోవు.. అని నా చిన్నతనంలో మా వాళ్లు విసుక్కునేవారు. కానీ ఇప్పుడు నాకు అదే పెద్ద వరమయింది. పరిసరాలను, రోజూవారీ అంశాలనూ పట్టించుకుంటూ పోతే మనశ్శాంతికి దూరమవుతామని నా ఫీలింగ్‌'' అని అంటోంది నయనతార.

English summary
Before signing “Bhaskar The Rascal” project, it is heard that Nayan insisted on a special clause. That is nothing but she should be the heroine of the film in case if it gets remade in any language. In all versions, only Nayan will play the role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu