»   » నిర్మాత ద్వారా ప్రభుదేవా రాయబారం, ఛీ కొట్టిన నయన!

నిర్మాత ద్వారా ప్రభుదేవా రాయబారం, ఛీ కొట్టిన నయన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార జీవితంలో చోటు చేసుకున్న ఆటు పోట్ల గురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నయనతార కెరీర్ పరంగా ఎంత ఎత్తుకు ఎగిసిందో...వ్యక్తి గత జీవితం పరంగా అనేక రకాల ఇబ్బందులు పడింది. తొలుతు శింబుతో ప్రేమాయణం. అతనితో విడిపోయిన తర్వాత ప్రభుదేవాతో సహజీవనం, వీరి వ్యవహారం పెళ్లి వరకు వెళ్లి పెటాకులు కావడం అప్పట్లో ఓ సెన్సేషన్.

శింబుతో ప్రేమాయణం, విడిపోవడం వల్ల నయనతార మనసు పెద్దగా గాయపడలేదు కానీ, ప్రభుదేవాతో వ్యవహారం మాత్రం ఆమెను తీవ్రంగా కుంగిపోయేలా చేసింది. అందుకే నటుడు శింబునైనా క్షమిస్తానుగాని ప్రభుదేవాను మన్నించేది లేదని ఆ మధ్య ఓసారి ఆమె చెప్పిందంటే ప్రభుదేవాతో ఆమె కోపం తీవ్రం ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుదేవా-నయనతార పీకల్లోతు ప్రేమించుకుని సహజీవనం చేసారు. పెళ్లి చేసుకుంటారు అనే సమయంలో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి విడిపోయారు. మరి ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ.....ప్రభుదేవా అంటే అసహ్యించుకునే స్థాయికి చేరింది నయనతార.

ప్రభుదేవాతో చేదు అనుభవాల నుండి త్వరలగానే కోలుకున్న నయనతార ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. కాగా... అటు భార్యతో విడాకులు తీసుకుని, ఇటు ప్రియురాలికి దూరమై ఒంటరిగా ఉంటున్న ప్రభుదేవా ఒంటరి తనం భరించలేక నయనతారకు దగ్గరడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు ఓ తెలుగు నిర్మాత ద్వారా రాయబారం పంపినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సదరుద నిర్మాత నయనతారను ఈ విషయమై సంప్రదించగా ప్రభుదేవాను ఛీదరించుకున్నట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అదరి జరుగదని, నా జీవితాన్ని ఇక నాశనం చేసుకోదలుచుకోలేదని తెగేసి చెప్పినట్లు సమాచారం.

Nayanthara doesn't want to pair Prabhu Deva at any cost

అయితే సదరు ప్రొడ్యూసర్ ఆమెను కలిసింది ఇద్దరినీ కలపడానికి కాదని మరో వాదన కూడా ప్రచారంలో ఉంది. ఇద్దరితో ఓ సినిమా చేయాలని సదరు నిర్మాత ట్రై చేస్తున్నాడని, ఈ మేరకు ఆ ప్రతిపాదన నయనతార ముందు ఉంచగా ఆమె తిరస్కరించిందని అంటున్నారు. శింబుతో మళ్లీ చేయమంటే చేస్తాను కానీ, ప్రభుదేవా నీడ కూడా తన మీద పడటానికి వీల్లేదని తేల్చి చెప్పిందట.

English summary
Film Nagar source said that, Nayanthara doesn't want to pair Prabhu Deva at any cost.
Please Wait while comments are loading...