Just In
- 24 min ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 1 hr ago
‘ఖిలాడీ’ అప్‌డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
- 1 hr ago
మీకు అలాంటి పరిస్థితి రావొద్దు.. వాటిని పూసగుచ్చినట్టు వివరించిన రకుల్
- 2 hrs ago
అది ముగిసింది ఇది దొరికింది.. చమ్మక్ చంద్ర లక్ ‘అదిరింది’
Don't Miss!
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- News
జై హింద్, జై బంగ్లా: జై శ్రీరాం నినాదాలపై దీదీ గరం గరం, మోడీ సమక్షంలోనే ఫైర్..
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్‌డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నయనతార అవుట్, కాజల్ ఇన్.. చిరంజీవి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ఖైదీ నెంబర్ 150తో సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న తాజా సినిమా 'సైరా నరసింహ రెడ్డి'. ఆయన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. దీని తర్వాత మెగాస్టార్ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది. 'భరత్ అనే నేను' సినిమా తర్వాత చిరంజీవి కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు కొరటాల. సైరా షూటింగ్‌లో ఆలస్యం కారణంగా చిరంజీవి ఆయన సెట్స్ పైకి రావడం కాస్త ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు సైరా షూటింగ్ ఫినిష్ కావడంతో ఇక మెగా 152 సినిమా అప్‌డేట్స్‌పై పడ్డాయి అందరి కళ్లు. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

మెగా మూవీ.. హీరోయిన్స్ విషయంలో స్పెషల్ కేర్
మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబోలో రాబోతున్న తొలి సినిమా ఇదే కావడంతో ఈ సినిమాకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు కొరటాల. మెగాస్టార్ ఇమేజ్ దృష్టిలో ఎత్తుకొని పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేసిన ఆయన.. హీరోయిన్లను సెలెక్ట్ చేసే విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

నయన్ అవుట్.. కాజల్ ఇన్
ముందుగా ఈ సినిమాలో చిరు సరసన అనుష్క లేదా నయనతార నటించనున్నారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా బయటకొచ్చిన సమాచారం మేరకు చిరు సరసన వీళ్ళిద్దరిలో ఎవ్వరూ నటించడం లేదని తెలుస్తోంది. కొత్తగా కాజల్ పేరు బయటకొచ్చింది. చిరు సరసన కాజల్ అయితేనే పర్ఫెక్ట్ సూట్ అని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు. గతంలో చిరు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెం 150లో చిరుతో జోడీ కట్టి భేష్ అనిపించుకున్న కాజల్‌నే మరోసారి హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

భారీ రెమ్యునరేషన్ ఆఫర్
50 సినిమాలు పూర్తిచేసి మంచి జోష్‌లో ఉన్న కాజల్ కోసం భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిందట కొరటాల టీమ్. కాజల్ వద్దకు హీరోయిన్ ప్రస్తావన తీసుకెళ్లగా ఆమె వెంటనే ఓకే చేసేసింది తెలుస్తోంది. ఇక ఇదే నిజమైతే మరోసారి కాజల్- చిరంజీవి సిల్వర్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకలోకానికి సూపర్ ట్రీట్ ఇవ్వనున్నట్లే మరి.

చిరంజీవి విలక్షణ పాత్ర
చిరంజీవి కోసం ఓ విలక్షణ పాత్రను డిజైన్ చేశారట కొరటాల శివ. చిత్రంలో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించేలా చిరు పాత్ర ఉండనుందట. ఈ మేరకు చిరంజీవిని కాస్త బరువు తగ్గాలని కూడా కొరటాల కోరాడని తెలిసింది. ఈ మేరకు చిరు ఫిట్‌నెస్‌పై సలహాలు, సూచనల కోసం రామ్ చరణ్, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ని సంప్రదించగా.. ఆయన ఓ ప్రత్యేకమైన ఫిట్‌నెస్ ట్రైనర్‌ని పంపించాడని తెలిసింది.

త్వరలోనే షూటింగ్ స్టార్ట్
'సైరా' షూటింగ్ ఫినిష్ అయింది కాబట్టి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ ఆలోచనలో ఉన్నారట చిరు- కొరటాల. త్వర త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి ఈ సినిమాను 2020 ద్వితీయార్థంలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. మొత్తానికైతే షూటింగ్ మొదలుకాక ముందు నుంచే చిరు- కొరటాల సినిమాపై భారీ హైప్ నెలకొంది. మరోవైపు చిరు ప్రెసెంట్ మూవీ 'సైరా నరసింహా రెడ్డి' అక్టోబర్ 2 న విడుదలకు సిద్ధమైంది.