For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Godfather Movie:చిరంజీవికి చెల్లెలుగా నటించిన నయనతారకు కళ్లు చెదిరే పారితోషికం!.. మరి అన్ని కోట్లా?

  |

  మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ మూవీ రీమేక్ గా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఆచార్య మూవీ డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ లో బ్రహ్మగా అదరగొట్టారు చిరంజీవి. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు రాగానే సినిమాపై అంచనాలు అమాంత పెరిగాయి. అందుకు అనుగుణంగానే గాడ్‌ఫాదర్ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఇందులో చిరంజీవికి చెల్లెలుగా నటించిన సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

   21 ఏళ్ల క్రితం తెలుగు సినిమాకు..

  21 ఏళ్ల క్రితం తెలుగు సినిమాకు..

  ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అలా సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించిన ఆయన.. ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి 'గాడ్ ఫాదర్' మూవీ. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు 21 ఏళ్ల క్రితం హనుమాన్ జంక్షన్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజాను ఈ సినిమాకు డైరెక్టర్‌గా తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

   ఆరంభం నుంచే అంచనాలు..

  ఆరంభం నుంచే అంచనాలు..

  కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన 'గాడ్ ఫాదర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇందులో బడా స్టార్లను భాగం చేశారు. ముఖ్యంగా ఈ మూవీలో చిరంజీవికి సోదరి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించడం. అలాగే, హీరోను కాపాడే మాఫియా డాన్ రోల్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించడంతో ఆ అంచనాలు పెరిగిపోయాయి. ఇన్ని అంచనాల మధ్య విజయదశమి దసరా కానుకగా అక్టోబర్ 5న చాలా గ్రాండ్ గా విడుదలైంది చిరంజీవి గాడ్ ఫాదర్. సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సూపర్ అనే మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.

  చిరంజీవి చెల్లెలుగా నయనతా

  చిరంజీవి చెల్లెలుగా నయనతా

  ర..

  అయితే ప్రస్తుతం ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా నటించిన నయనతార పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం తీసుకున్న పారితోషింక ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ చిత్రానికి తీసుకోలేదట. ప్రస్తుతం వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం నయనతార ఈ సినిమాకు సుమారు రూ. 7 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇలా చెల్లెలి పాత్ర చేసి ఇంత మొత్తం పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా రికార్డుకెక్కినట్లే. నిజానికి మలయాళం చిత్రం లూసీఫర్ లో హీరోయిన్ క్యారెక్టర్ లేకున్నా నయనతార గాడ్ ఫాదర్ చిత్రం చేస్తుందని కన్ఫర్మ్ అయింది. లూసీఫర్ లో మోహన్ లాల్ సిస్టర్ రోల్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి నయనతార పాత్ర పెద్దగా లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ తన పాత్ర పరిధి మేర న్యాయం చేసిందని టాక్.

  చిరంజీవిని హైలెట్ చేశాడని..

  చిరంజీవిని హైలెట్ చేశాడని..

  లూసీఫర్ లో కథ మొత్తం ఆ సిస్టర్ రోల్ పైనే నడుస్తుంది. కానీ గాడ్ ఫాదర్ లో మాత్రం ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవిని హైలెట్ చేశాడని టాక్. దీంతో నయనతార పాత్ర నామమాత్రం అయిందట. అందుకోసమే నయనతార షాకింగ్ కండిషన్లు పెట్టి మరి ఇంత పారితోషికం డిమాండ్ చేసిందని ప్రస్తుతం వినిపిస్తున్నటాక్. మరి ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజముందో తెలియదు. కాగా ఇటీవలే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లాడిన నయనతార వివాహబంధాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇక ప్రస్తుతం కమిట్ అయిన మూవీస్ చిత్రీకరణ పూర్తైన తర్వాత సినిమాలకు నయనతార గుడ్ బై చెప్పనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

  English summary
  South India Lady Superstar Nayanthara Remuneration Is Rs 7 Cr For Megastar Chiranjeevi Starrer Godfather Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X