ఆషామాషీ మూవీ కాదు ... బాలయ్య కెరీర్‌లో నెవ్వర్ బిఫోర్.. NBK 111పై థమన్ లీకులు

వరుస సినిమాలతో తన కెరీర్‌లోనే లేనంత ఫుల్ స్వింగ్‌‌లో ఉన్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌లతో వరుస విజయాలు అందుకున్న బాలయ్య డబుల్ హ్యాట్రిక్ మీద కన్నేశారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2లో నటిస్తున్నారు బాలకృష్ణ . డిసెంబర్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుండగా.. ఆ తర్వాత కూడా కాంబినేషన్‌‌లు సెట్ చేసుకున్నారు బాలయ్య. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరోసారి నటించనున్నారు బాలకృష్ణ.

బాలయ్య కెరీర్‌లో టాప్ మూవీగా
ఎన్‌బీకే 111 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరసింహారెడ్డిలో బాలయ్యను కొత్తగా, డిఫరెంట్‌గా చూపించిన గోపీచంద్.. ఈసారి మాత్రం ఆయనను మరో లెవల్‌లో చూపించనున్నారట. బాలయ్య కెరీర్‌లోనే ఎప్పుడు రాని స్థాయిలో ఈ సినిమా ఉంటుందని గాసిప్స్ వైరల్ అవుతుండగా.. సంగీత దర్శకుడు థమన్ చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

NBK 111 SS Thaman about Nandamuri Balakrishna and Gopichand Malineni movie

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్
వృద్ది సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నటీనటులు సాంకేతిక నిపుణులు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రంలో బాలయ్య మహారాజుగా నటిస్తున్నారని ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌లో వరల్డ్ మ్యాప్, కోటలు, యుద్ధరంగంలో మంటలు, ఇసుకలో కూరుకుపోయిన కత్తి దాని చుట్టూ గడియారం ఉండటంతో ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లో తెరకెక్కుతోన్న మూవీ అని అర్ధమవుతోంది.

బాలయ్య సరసన మహారాణి ఎవరు?
మరి రాణిగా నటించే హీరోయిన్ ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. ఎన్‌బీకే 111లో హీరోయిన్ ఎవరన్న దాని గురించి రకరకాల ఊహాగానాలు వినిపించగా ఫైనల్‌గా ఓ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు.. లేడీ సూపర్‌స్టార్ నయనతార. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నయనతార ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య సరసన నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. వీరిద్దరూ ఇప్పటికేప సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా వంటి సినిమాల నటించడంతో పాటు హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి బాలయ్య - నయనతార స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండటంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో నయనతార రోల్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెబుతున్నారు. రాణి ఎవరన్న దానిపై నవంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 12.01 గంటలకు అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మరి ఎన్‌బీకే 111లో నయనతార హీరోయిన్‌గా ఎంపికైంది? లేనిది మరికొద్దిగంటల్లో తేలిపోనుంది.

అంచనాలు పెంచేసిన థమన్
ఇదిలాఉండగా.. గోపీచంద్ మలినేని - బాలకృష్ణల లేటెస్ట్ కాంబో, ఎన్‌బీకే 111పై సంగీత దర్శకుడు థమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ.. బాలయ్య బాబుతో గోపీ చాలా గొప్ప సినిమా తీస్తున్నాడు.. ఆషామాషీ సినిమా కాదు అది. చాలా పెద్ద సెటప్, మొన్ననే కొన్ని ప్రీ విజ్యువల్స్ అని చెప్పి చూపించారు.. గోపీ అదరగొట్టేశాడు, మామూలుగా లేదు. కాంతార 2 కెమెరామెన్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడు. మూవీ చాలా బాగా వస్తోందని థమన్ అన్నారు. దాంతో ఎన్‌బీకే 111పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X