»   » ఎన్టీఆర్, మహేష్ కాదన్నా కలిసొచ్చింది

ఎన్టీఆర్, మహేష్ కాదన్నా కలిసొచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నేను శైలజ చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకుంది కీర్తి శైలజ. ఆమె ఫెరఫార్మెన్స్ తోటే వరస పెట్టి ఆఫర్స్ సంపాదించుకుంటోంది. అయితే ఆమెకు ఎన్టీఆర్ సరసన జనతా గ్యారేజ్ లోనూ, మహేష్ సరసన మురుగదాస్ చిత్రంలోనూ ఆఫర్స్ వచ్చాయని వార్తలు వచ్చాయి.

Nenu Sailaja heroine Keerthi Suresh bags big movie

కానీ అవి కేవలం రూమర్స్ క్రింద మాత్రమే మిగిలిపోయాయి. ఒక్క తెలుగు సినిమా కూడా ఆమె ఓకే చేయలేదు. అయితే తమిళ స్టార్ హీరో విజయ్ ప్రక్కన అతని 60 వ చిత్రంలో ఓకే అయినట్లు సమాచారం. తెలుగులో సెట్ కాకపోయినా, తమిళంలో ఒక ఊపు ఊపుదామనే ఆలోచనలో ఆమె ఉంది.

ఇక కీర్తి సురేష్ కు తెలుగులో ఒక్క ప్రాజెక్టు ముందుకు వెళ్లకపోవటానికి కారణం..రకరకాల కండీషన్స్ అని చెప్తున్నారు. స్క్రిప్టు ని తనకు పూర్తిగా వినిపించాలని దర్శకులకు సూచిస్తోందని చెప్తున్నారు. కేవలం తన క్యారక్టర్ వరకే చెప్తే కుదరని అంటోందట.

Nenu Sailaja heroine Keerthi Suresh bags big movie

అలాగే సినిమా కొద్ది పాటి రొమాంటిక్ సీన్స్ ఉన్నా వెంటనే నో చెప్పేస్తోందని అంటున్నారు. చివరకు తన తల్లి సీనియర్ నటి మేనక ని కూడా తన కథల విషయంలో జోక్యం కలగచేసుకోనివ్వటం లేదని వినికిడి. కథలు వినేటప్పుడు సోలోగా వింటోందని చెప్తున్నారు.

English summary
So far Keerthi Suresh has not signed any film in Telugu despite Nenu Sailaja being a hit film. But the actress will be acting with none other that actor Vijay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu