»   » పవన్ కళ్యాణ్ ఈ ట్విస్ట్ ఏంటీ?

పవన్ కళ్యాణ్ ఈ ట్విస్ట్ ఏంటీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ప్రకటన వచ్చిందనగానే అభిమానుల్లో ఆనందం కలిగింది...అదే సమయంలో ఊహించని ట్విస్ట్ కు ఆశ్చర్యపోతున్నారు. అంతా పవన్ నుంచి 'గబ్బర్ సింగ్ 2' ఓపినింగ్ గురించి ప్రకటన వస్తుందనుకున్నారు. కానీ ఇలా వెంకటేష్ తో కలిసి ఓ మైగాడ్ రీమేక్ చేస్తాడని అనుకోలేదు. ఈ చిత్రానికి డేట్స్ కేటాయిస్తే గబ్బర్ సింగ్ కి ఎలా ఎడ్జెస్ట్ చేస్తాడని అంటున్నారు. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సీన్స్ తక్కువే ఉంటాయి కాబట్టి ఆ సమస్య రాకపోవచ్చునని కొందరంటున్నారు.

ఇక పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఇప్పటికి కుదిరింది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. 'మేన్‌ హూ స్యూడ్‌ గాడ్‌' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.

హీరోగా వెంకటేష్‌ని ఇది వరకే ఎంచుకొన్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా పవన్‌ కల్యాణ్‌ కూడా రంగంలోకి దిగిపోయారు. ఈ విషయాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ దృవీకరించింది. ''పవన్‌, వెంకటేష్‌ కలిసి నటిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తాం'' అని డి.సురేష్‌బాబు చెప్పారు. వీలైనంత త్వరలో ఈ చిత్రాన్ని మొదలెట్టి, యేడాది చివర్లో విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శరత్‌ మరార్‌ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు.

ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంతో పాటు ఇతర అంశాలను త్వరలోనే వెల్లడిస్తామని సురేశ్‌బాబు చెప్పారు. వెంకటేశ్, పవన్‌కల్యాణ్, సురేశ్ ప్రొడక్షన్స్ కలయికతో ఒక ప్రతిష్ఠాత్మక సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని శరత్ మరార్ తెలిపారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో మహేశ్‌తో కలిసి నటించిన వెంకటేశ్ ఇప్పుడు పవన్‌కల్యాణ్‌తో జట్టు కడుతూ తెలుగులో మల్టీస్టారర్ ధోరణిని కొనసాగిస్తున్న హీరోగా పేరు తెచ్చుకున్నారు.

English summary
Venkatesh will be starring in a film based on the English film ' Man who sued God' and the Hindi film ' Oh My God'. The latest about this film is that it will also star Powerstar Pawan Kalyan. It is official now.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu