»   » చిరంజీవి చిత్రం రీమేక్ లో రామ్ చరణ్

చిరంజీవి చిత్రం రీమేక్ లో రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇన్నాళ్ళూ తన తండ్రి పాటలను రీమిక్స్ చేస్తూ వస్తున్న రామ్ చరణ్ త్వరలో తన తండ్రి చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారా అంటే అవుననే ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. శ్రీను వైట్ల, రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం కథ..చిరంజీవి హిట్ చిత్రం మరణ మృదంగం నుంచి తీసుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఆ చిత్రాన్ని కేవలం బేస్ స్టోరీ లైన్ ని మాత్రమే తీసుకుని మిగతాది శ్రీను వైట్ల స్టైల్ ఆఫ్ నేరేషన్ లో ఉండబోతోందని అంటున్నారు. ఈ మేరకు శ్రీను వైట్ల...చిరుని కలిసి వివరించాడని చెప్పుకుంటున్నారు. ఆ చిత్రంలో రామ్ చరణ్ ..సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తాడని, అందుకోసమే సిక్స్ ప్యాక్ బాడీని సైతం సిద్దం చేసుకుంటున్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్...కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న గోవిందుడు అందరి వాడేలే చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

 News About Charan,Srinu Vytla movie

రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నట్లు రెండేళ్ల నుంచీ ప్రచారంలో ఉంది. ఇన్నాళ్లకు అది ఓ కొలిక్కి వచ్చింది. ఆ కాంబినేషన్‌తో సినిమా తీసే అవకాశం యూనివర్సల్ మీడియా అధినేత డి.వి.వి. దానయ్యకు లభించింది. చరణ్ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో నటిస్తుండగా, మహేశ్‌తో శ్రీను వైట్ల 'ఆగడు' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఆగస్టు నాటికి పూర్తవుతాయని సమాచారం. నవంబర్ నుంచి షూటింగ్ మొదలు కానుందని అంటున్నారు.

అంటే రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ సినిమా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. శ్రీను మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. శ్రీను గతంలో చిరంజీవి హీరోగా 'అందరివాడు'ను రూపొందించారు. ఇప్పుడు ఆయన కుమారుడిని ఆయన డైరెక్ట్ చేయబోతున్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''దేశముదురు', 'జులాయి', 'నాయక్‌', 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'... చిత్రాల్ని మా సంస్థ తెరకెక్కించింది. ఇప్పుడు మరోసారి చరణ్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. నాయిక, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతాము''అన్నారు.

English summary

 
 Impressed by the script narrated by director Sreenu Vaitla, our young megastar has given him nod already. story of this movie will have a resemblance to Megastar's past hit 'Marana Mrudangam' that is based on novel of same name written by Yandamuri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu