»   » అనుష్క స్థానంలో నికిషా!

అనుష్క స్థానంలో నికిషా!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పవన్ కళ్యాన్ తో నటించిన 'పులి" సినిమా హిట్టయితే తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవచ్చని ఆశపడ్డ నిఖిషా పటేల్ ఆ సినిమా ప్లాపవడంతో...తెలుగులో ఏ ఒక్క అవకాశం కూడా దక్కించుకోలేకపోయింది. అయితే కోలీవుడ్, సాండల్ వుడ్ లలో మాత్రం కొన్ని అవకాశాలు దక్కించుకుని ఓ మోస్తరు హీరోయిన్‌గా కొనసాగుతోంది.

  తాజాగా అందిన సమాచారం ప్రకారం...నికిషా టాలీవుడ్ ఎంట్రీకి రూట్ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మధ్య గోపీచంద్-అనుష్క జంటగా 'లక్ష్యం" సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా కన్నడలో 'వరద నాయక" అనే పేరుతో రూపొందుతోంది. లక్ష్యంలో అనుష్క పోషించిన పాత్రను ఇందులో నికిషా దక్కించుకుంది. ఇందులో సుదీప్, అర్జున్ లాంటి పెద్ద స్టార్స్ నటిస్తున్నారు. భూమిక కూడా ఇందులో ఓ పాత్ర పోషిస్తుందట. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే....తెలుగులోనూ అవకాశాలు దక్కించుకోవచ్చని ఆశ పడుతోందట నిఖిషా పాప.

  English summary
  Nikesha is reprising the role of Anushka in the Kannada version. The film has some big names like Sudeep, Arjun and it is also heard that even Bhumika Thakur would be part of it. The Tollywood folks say if all this is true then it will be a big boost for Nikesha and there is no doubt that she would be brought back to Telugu cine circuit.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more