»   » బాబూ నితిన్....నీకు ఇది న్యాయమా?

బాబూ నితిన్....నీకు ఇది న్యాయమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలు వరుస భారీ విజయం సాధించడంతో పాటు తాజాగా విడుదలైన 'హార్ట్ ఎటాక్' చిత్రానికి కూడా పాజిటివ్ టాక్ రావడంతో యంగ్ హీరో నితిన్ రేంజి బాగా పెరిగింది. వరుస విజయాలతో నితిన్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో రెమ్యూనరేషన్ విషయంలో కొండెక్కి కూర్చున్నాడు. ప్రస్తుతం 5 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తే తప్ప సినిమా చేయను అంటున్నాడట.

దీంతో నితిన్‌తో సినిమాలు చేయాలనుకుంటున్న మధ్యస్థాయి నిర్మాతలు లబోదిబో మంటున్నారు. అంతకు ముందు నితిన్ లాంటి హీరోలతో సినిమాలు తీయాలంటే 10 నుండి 12 కోట్లు ఉంటే సరిపోయేవి. కానీ ప్రస్తుతం నితిన్ డిమాండ్ చేస్తున్నట్లు రెమ్యూనరేషనే 5 కోట్లు ఇస్తే సినిమా ఖర్చు మరింత పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. సినిమా బాగా ఆడితే నితిన్ అడిగిన మొత్తం అడగటానికి తామూ సిద్ధమే కానీ.... ఒక వేళ సినిమా ఆడకపోతే మా పరిస్థితి ఏమిటి? అని పలువురు నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు.

హార్ట్ ఎటాక్ మూవీ బిజినెస్ వివరాల్లోకి వెళితే...
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో పూరి జగన్నాథ్ రూపొందించిన 'హార్ట్ ఎటాక్' చిత్రం ఈ రోజు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. నితిన్, అదాశర్మ (పరిచయం) జంటగా నటించిన ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం రిలీజ్ కు ముందే ఏడు కోట్లు లాభంలో ఉందని సమాచారం. పూరీ జగన్నాథ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఈ చిత్రం బిజినెస్ చేసారని,అందులోనూ ట్రైలర్స్,పోస్టర్స్ కు మంచి క్రేజ్ రావటం,నితిన్ మార్కెట్ బాగుండటంతో రిలీజ్ కు ముందే బిజినెస్ పరంగా హిట్ అయ్యింది.

ట్రేడ్ లో వినపడుతున్న లెక్కలు ప్రకారం ...ఈ చిత్రం బడ్జెట్ 14 కోట్లు. అయితే మొత్తం బిజినెస్ శాటిలైట్,ఓవర్ సీస్,డిస్ట్రిబ్యూషన్ రైట్స్,ఆడియో అన్ని కలిపి 21 కోట్లు వ్యాపారం నడిచింది. జెమెనీ ఛానెల్ వారు నాలుగున్న కోట్లు పెట్టి శాటిలైట్ రైట్స్ రైట్స్ తీసుకున్నారు. థియోటరకల్ రైట్స్ నిమిత్తం 16.5 కోట్లు(నైజం ఆరు కోట్లు, సీడెడ్ 2.5 కోట్లు, మిగతా ఏరియాల నుంచి 8 కోట్లు )వచ్చింది. దాంతో నిర్మాతగా లాభాలతో పూరీ జగన్నాథ్ ఒడ్డున పడినట్లే అని చెప్తున్నారు.

English summary
The latest buzz is that actor Nitin hikes his remuneration. After Gunde Jaari Gallanthayindhe his latest remuneration is 5 crore. Earlier, he charged Rs 4 crore as remuneration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu