»   » పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ రీమేక్ లో నితిన్?

పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ రీమేక్ లో నితిన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nitin in Toli Prema Remake?
హైదరాబాద్ : నితిన్, దర్శకుడు కరుణాకరన్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ మేరకు నితిన్ కి నాలుగైదు కథలు వినిపించినప్పటికి అతను చివరికి పవన్ రీమేక్ ని చేయటానికి ఆసక్తి చూపుతున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన తొలి ప్రేమ చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఆలోచనతో నితిన్ ఉన్నాడని, పవన్ ఫర్మిషన్ కోసం చూస్తున్నాడని అంటున్నారు. పవన్ ఓకే చేస్తే...నితిన్ నెక్ట్స్ చిత్రం అదే అయ్యే అవకాసం ఉందని వినికిడి. అలాగే తమ సొంత బ్యానర్ పైనే ఈ చిత్రం చేస్తారు.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా 'హార్ట్‌ఎటాక్‌' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే . క్యారక్టరైజేషన్ తో సినిమా నడుస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నితిన్‌ని ఓ పోకిరి ప్రేమికుడిగా చూపించబోతున్నారు. తొలిసారిగా నితిన్ ...పూరి దర్శకత్వంలో నటించటంపై మంచి అంచానాలే ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అనుకున్నారు కానీ వాయిదా వేసారు.

నిర్మాత మాట్లాడుతూ... ''మాస్‌, క్లాస్‌ అంశాలు మేళవించిన ప్రేమ కథ ఇది. నితిన్‌ గెటప్‌, ఆయన పాత్ర చిత్రణ ఆకట్టుకొంటాయి. స్పెయిన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. అనూప్‌ రూబెన్స్‌ అందించిన పాటలు యువతరాన్ని అలరిస్తాయనే నమ్మకం ఉంది'' అని చెప్తున్నారు.

నితిన్ ఈసినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానని అంటున్నాడు నితిన్.అనూప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

English summary
Nitin is all set to team up with Karunakaran for a new film. Many speculations are started about the film in Film Nagar, latest buzz is that it is a remake of Pawan Kalyan “Toli Prema”. The shooting of this film will start after Nitin completes his current commitments. Shresth Movies is Keen to produce this film and other details about this project will be out soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu