»   » చార్మి వల్లే? నితిన్-పూరి మూవీ రద్దయిందా?

చార్మి వల్లే? నితిన్-పూరి మూవీ రద్దయిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. వాస్తవానికి ఈ చిత్రం నితిన్ తో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల నితిన్ ప్లేసులోకి వరుణ్ తేజ్ వచ్చాడు.

కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను అని నితిన్ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కాస్త ఘాటుగానే పూరి స్పందించారని ఆయన తాజా ట్వీట్ చూస్తే అర్దమవుతుంది.

పూరీ ట్వీట్ చేస్తూ..." నేను నితిన్ తో చేద్దామనుకున్న ప్రాజెక్టుని వేరే హీరోతో చేస్తున్నాను. అదే రోజున షూటింగ్ ప్రారంభమవుతుంది..మిగతా వివరాలు త్వరలో తెలియచేస్తాను " అన్నారు. అదే రోజున వేరే హీరోతో ఇదే కథతో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తానని పూరి వెంటనే అనటం అంతటా చర్చనీయాంశంగా మారింది.

Nitin walked out of Puri film, Why?

కాగా...ఈ ప్రాజెక్టు రద్దవడానికి కారణం కొన్ని విషయాల్లో పూరి, నితిన్ మధ్య విబేధాలు రావడమే అని అంటున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ నిర్మించాలనుకున్నారు. కానీ నితిన్ తన బేనర్లోనే సినిమా తీయాలని పట్టుదలతో ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని అంటున్నారు.

ఇది ఓ కారణం అయితే.... చార్మిని తన సినిమాకు సహ నిర్మాతగా పెట్టాలని చూడటం కూడా నితిన్ కు నచ్చలేదని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం చిలికి చిలికి సినిమా రద్దయ్యే వరకు వెళ్లిందని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

English summary
Some say that Puri Jagan has roped in Charmi as co-producer for Nitin's movie. This movie has perplexed Nitin and that's why he walked out of the flick.
Please Wait while comments are loading...