»   » ‘బ్రహ్మోత్సవం’లో ఆ సీన్లు లేవట..ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?

‘బ్రహ్మోత్సవం’లో ఆ సీన్లు లేవట..ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ వేసవిలో అభిమానులను అలరించడానికి సిద్దమవుతోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక్క ఫైట్ సీన్ కూడా చేయలేదట. సాధారణంగా మహేష్ బాబు ప్రతి సినిమాలోనూ యాక్షన్ సీన్లు ఉంటాయి. మహేష్ గత చిత్రం 'శ్రీమంతుడు'లో మహేష్ బాబు యాక్షన్ సీన్లు అదరగొట్టారు.

అయితే బ్రహ్మోత్సవంలో అలాంటి సీన్లు ఉండటం లేదు. ఈ సినిమా మహేష్ బాబు గత సినిమాలతో పోలిస్తే డిఫరెంటుగా ఉండబోతోంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమా విభిన్నంగా ప్రజెంట్ చేయబోతున్నారు.

Brahmotsavam

మాస్ జనాలను ఆకట్టుకోవాలంటే యాక్షన్ సీన్లు, ఐటం సాంగులు తప్పనని సరి....అభిమానులు కూడా ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటారు. మరి అవేమీ లేకుండా వస్తున్న ఈ చిత్రాన్ని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చర్చనీయాంశం అయింది.

'బ్రహ్మోత్సవం చిత్రాన్ని ప్రసాద్ వి పొట్లూరి 'పివిపి' బేనర్లో నిర్మిస్తున్నారు. మహేష్ బాబుకు చెందిన జి.మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కూడా సినిమా నిర్మాణంలో భాగమవుతున్నట్లు సమాచారం.

మహేష్ బాబు సరసన కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యరాజ్, జయసుధ, నరేష్, రేవతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా చేస్తున్నారు.

English summary
As per the reliable sources, we heard that, Mahesh Babu is not going to do action sequences in his upcoming release 'Brahmotsavam'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu