»   » కొత్త ట్విస్ట్: ఆ హీరోలకు కోపాలు వస్తాయనే రాజమౌళి ఇలా

కొత్త ట్విస్ట్: ఆ హీరోలకు కోపాలు వస్తాయనే రాజమౌళి ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ నెల 31 న జరగనున్న 'బాహుబలి' చిత్రం ఆడియో పంక్షన్ కు ... ఛీఫ్ గెస్ట్ లుగా చిరంజీవి, రజనీకాంత్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ హాజరవుతారని వార్తలు గత కొద్ది రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిత్రంలో పనిచేసిన హీరోలు తప్ప ఈ పంక్షన్ లో స్టార్స్ కనపడరని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. తెలుగు నుంచి చిరంజీవి ని ఒక్కరినే పిలిస్తే...మిగతా స్టార్ హీరోలను నెగ్లెట్ చేసినట్లుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


తమిళంలోనూ అదే పరిస్దితి..కాకపోతే రజనీకాంత్ అక్కడ సూపర్ స్టార్...ఇది బేసిక్ గా తెలుగు సినిమా కాబట్టి అక్కడ హీరోలు పెద్ద పట్టించుకోకపోవచ్చు కానీ తెలుగులో అలాంటి పరిస్ధతి లేదు. రాజమౌళికి అందరు స్టార్ హీరోలు, సీనియర్ హీరోలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి.


No Chief Guests For Baahubali audio

దాంతో ...ఒకరిని పిలిచి, మరొకరిని పిలవకపోతే బాగుండదని ఆలోచించి, చివరి నిముషంలో ..గెస్ట్ లు వద్దు అని విరమించుకున్నట్లు చెప్పుకుంటున్నారు. కేవలం ఒక్క ఛీఫ్ గెస్ట్ నే పిలుద్దాం..అది రజనీనో, చిరంజీవో లేక అక్షయ్ అనేది తేలుతుంది. రజనీ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. అయితే ఇది కేవలం ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న మాటే. ఎంతవరకూ నిజమనేది..ఆడియో పంక్షన్ రోజు కానీ తెలియదు.


ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'. ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా పతాకంపై ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను, ఆడియో ను మే 31 న హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు.


ఆడియో లాంచ్ లో రిలీజ్ చేయనున్న ఫైనల్ ట్రైలర్ కట్ రెడీ అయ్యింది. ట్రైలర్ కి సంబందించిన సెన్సార్ కూడా పూర్తయ్యిందని, సెన్సార్ వారు ‘యు/ఏ' ఇచ్చారని ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపాడు. ఈ ట్రైలర్ రన్ టైం 2 నిమిషాలు ఉంటుందని సమాచారం.


No Chief Guests For Baahubali audio

ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించిన పోస్టర్స్ బయిటకు రావటంతో అందరిలో ఓ రేంజిలో ఆసక్తి పెరిగింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియోపై అనంతమైన అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ ఆడియోకు తమిళ,తెలుగు,హిందీ పరిశ్రమల నుంచి ప్రముఖులు వస్తూండటంతో ఆడియో లైవ్ రైట్స్ కు కూడా బాగా డిమాండ్ ఏర్పడింది. చిత్ర ఆడియో ప్రత్యక్ష ప్రసారాలను ప్రసారం చేసేందుకు అన్ని ఛానెల్స్ పోటీ పడ్డాయి.


అయితే తెలుగు న్యూస్ ఛానల్ టీవీ5 భారీ ధర చెల్లించి ప్రత్యక్ష ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఈ రేటు ఒక కోటి అని తెలుస్తోంది. కోటి రూపాయలు ఓ ఆడియో పంక్షన్ టెలీకాస్ట్ రైట్స్ కు పలకటం సాధారణ విషయం కాదు అంటున్నారు.


తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా జులై 10న 3500 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రచారాన్ని చిత్రబృందం వినూత్నంగా నిర్వహిస్తోంది.


No Chief Guests For Baahubali audio

ఇందులో భాగంగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు పరిచయం చేయడానికి కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వేదికగా చేసుకొంది. శోభు యార్లగడ్డ, ఛాయాగ్రాహకుడు కె.కె.సెంథిల్‌కుమార్‌, ఎస్‌.ఎస్‌.కార్తికేయ ఆధ్వర్యంలో ఓ బృందం కేన్స్‌కు వెళ్లింది. అక్కడ కేన్స్‌ ప్రతినిధి క్రిస్టియన్‌ జేన్‌ను కలిశారు.


ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ''బాహుబలి' రెండు భాగాలు కలిపి 290 నిమిషాల నిడివి ఉంటుంది. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం సినిమా నిడివి తగ్గించి విడుదల చేస్తాం. ఈ సినిమాను భారతీయ పురాణాల నేపథ్యంలో తెరకెక్కించలేదు. ఇది పూర్తిగా కొత్త కథ'' అని చెప్పారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రచారం కోసం ఫ్రంట్‌నైట్‌ సంస్థ అధిపతి ఫ్రాంకోయిస్‌ డ సిల్వాను తమ బృందంలో కలుపుకొంది చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా.


భల్లాలదేవ పాత్రలో నటించిన రానా ప్రచార చిత్రాన్ని బుధవారం రాజమౌళి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. సినిమాలో రానా ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. క్రూరుడైన ఓ రాజుగా ఆయన తెరపై సందడి చేయబోతున్నారు.


అలాగే... 'బాహుబలి' పాటల్ని లహరి మ్యూజిక్‌ ద్వారా విడుదల చేయబోతున్నారు. 'బాహుబలి' తెలుగు, తమిళ పాటలకు సంబంధించిన హక్కుల్ని లహరి మ్యూజిక్‌ సంస్థ చేజిక్కించుకొంది. ''భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే 'బాహుబలి' సినిమా పాటల్ని మా సంస్థ ద్వారా విడుదల చేస్తుండడం ఆనందంగా ఉంద''న్నారు లహరి మ్యూజిక్‌ అధినేత జి.మనోహర్‌నాయుడు.

English summary
Neither Chiranjeevi, Rajni nor Akshay or Allu Arjun are gracing the audio launch of 'Baahubali'. Probably Rajamouli might have thought of inviting Rajnikanth, and then he couldn't do that without inviting Telugu biggies.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu