»   » బద్రీనాథ్ సినిమా గురించి ఎటువంటి సమాచారం తెలియడం లేదు కారణం..

బద్రీనాథ్ సినిమా గురించి ఎటువంటి సమాచారం తెలియడం లేదు కారణం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మోగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా అంగరంగ వైభవంగా ప్రారంభమైన అల్లు అర్జున్ కొత్త చిత్రం బద్రీనాథ్ గురించి ప్రస్తుతం అసలు ఎటువంటి సమాచారం తెలియడం లేదు. దీనికి గాను పలు రకాల కారణాలు వెలువడుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది అల్లు అర్జున్ ప్రస్తుతం తన పెళ్శి పనుల్లో బిజీగా ఉండడమ్ దానికి కారణం అంటున్నారు. గతంలో కులు మనాలిలో షెడ్యూల్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ లోకొంత భాగం షూటింగ్ చేయడం, ఆతర్వాత అల్లు అర్జున్ తనకు కాబోయే భార్య స్నేహారెడ్డిల నిశ్చితార్దంలతో బిజీగా ఉన్నటువంటి అల్లు అర్జున్ సినిమాని అటకెక్కించారని ఫిలిం వర్గాల సమాచారం.

ఇక ఈసినిమా విషయానికి వస్తే ఇందులో అల్లు అర్జున్ సరసన మిల్క్ భామ తమన్నా చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాని మెగా ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి సినిమా గురించి ఎటువంటి కొత్త సమాచారం తెలియడం లేదు. అసలు షూటింగ్ జరుగుతుందో లేదో కూడా తెలియడం లేదని అభిమానలు వాపోతున్నారు. వేగులు ద్వారా తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఈసినిమాని వేసవికాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈసినిమాకి దర్శకత్వం వివివినాయక్ వహిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu