For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SSMB28: మహేశ్‌ సినిమాలో లేడీ విలన్.. హాట్ బ్యూటీని ఒప్పించిన గురూజీ.. ముందే లీకైన మాస్టర్ ప్లాన్

  |

  టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి పక్కా కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో మంచి ఊపు మీదున్న మహేశ్ బాబు.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హాట్ బ్యూటీ విలన్‌గా నటిస్తుందని ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  వరుస హిట్లు.. ఈ మూవీ మాత్రం

  వరుస హిట్లు.. ఈ మూవీ మాత్రం

  ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాయి. అయితే, ఈ ఏడాది వచ్చిన 'సర్కారు వారి పాట' మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. దీంతో ఇది సెమీ హిట్‌గానే మిగిలిపోయింది.

  Gaalodu Twitter Review: గాలోడుకు అలాంటి టాక్.. ప్లస్ మైనస్‌లు ఇవే.. ఇంతకీ సుధీర్ హిట్ కొట్టాడా అంటే!

  త్రివిక్రమ్‌తో జత కట్టిన మహేశ్

  త్రివిక్రమ్‌తో జత కట్టిన మహేశ్


  ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న మహేశ్ బాబు.. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. క్రేజీ కాంబో కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.

  యాక్షన్ మోడ్‌.. ఫస్ట్ షెడ్యూల్

  యాక్షన్ మోడ్‌.. ఫస్ట్ షెడ్యూల్

  దాదాపు పుష్కర కాలం తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. అంతేకాదు, ఫస్ట్ షెడ్యూల్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబుపై అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను, ఇంట్లో ఫైట్‌ను షూట్ చేశారు. ఇదంతా అనుకున్న దానికంటే మంచిగా వచ్చినట్లు తెలుస్తోంది.

  ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్ స్రవంతి: ఎద అందాలు ఆరబోస్తూ ఘోరంగా!

  కొత్త షెడ్యూల్... కృష్ణ మరణం

  కొత్త షెడ్యూల్... కృష్ణ మరణం


  మహేశ్ బాబు కెరీర్‌లోనే క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను డిసెంబర్ మొదటి వారం నుంచి షురూ చేయబోతున్నారని ఇటీవలే ఓ న్యూస్ లీకైంది. కానీ, రెండు రోజుల క్రితమే మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. దీంతో ఈ సినిమా షూట్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

  పని ఆపని గురూజీ.. కాస్టింగ్‌పై

  పని ఆపని గురూజీ.. కాస్టింగ్‌పై

  సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కించే సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఈ మూవీ కోసం ఆయన ఎంతో శ్రమిస్తున్నారు. ఇక, ఇప్పుడు గ్యాప్ రావడంతో గురూజీ ఈ సినిమా కాస్టింగ్‌ వర్కును చేస్తున్నాడని తెలిసింది. ఇందుకోసం ఆయన పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులతో సంప్రదింపులు చేస్తున్నాడని టాక్.

  రష్మీ గౌతమ్‌కు విల్లాను గిఫ్టుగా ఇచ్చిన హీరో: అతడి గురించి పెదవి విప్పబోతున్న యాంకర్

  సూపర్ స్టార్ కోసం లేడీ విలన్

  సూపర్ స్టార్ కోసం లేడీ విలన్


  త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని వైవిధ్యమైన కథతో రూపొందిస్తున్నారట. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫలేహి విలన్‌గా నటిస్తుందట. ఆమె పాత్రను ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే

  దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే


  ఇద్దరు స్టార్ల కలయికలో రాబోతున్న ఈ చిత్రంతో నోరా ఫతేహితో పాటు పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు భాగం కాబోతున్నారని తెలిసింది. ఇలా అన్ని భాషల నుంచి యాక్టర్లను తీసుకోవడానికి కారణం.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తుండడమే అని తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేస్తుందని సమాచారం.

  English summary
  Mahesh Babu Now Doing his 28 film with Trivikram Srinivas. Nora Fatehi to play Negative Role in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X