twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లండన్ లో చిరంజీవి... ఈ టైమ్ లో అక్కడేం పని?

    By Srikanya
    |

    హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి గత కొద్ది వారాలుగా లండన్ లో ఉన్నారు. ఆయన మే 30 న ఇండియాకు తిరిగి వచ్చి తన 150 వ చిత్రం ప్రకటిస్తారు. చిత్రం ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న ఈ సమయంలో ఆయన లండన్ ఎందుకు వెళ్లారనేది అందరిలో ఓ పెద్ద ప్రశ్నగా మారింది.

    కొందమంది ఫిలిం సర్కూట్స్ లో మాట్లాడుకునేదాన్ని బట్టి...ఆయన లండన్ లో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటున్నారు.తన వయస్సుని అథిగమించి, కుర్రాళ్లతో పోటీ పడేలా రెడీ అవుతున్నారని అంటున్నార. ఇక్కడ జిమ్ లో వర్కవుట్ లు చేసిన చిరంజీవి లండన్ లో బాడీ షేప్ కు సంభదించిన కొన్ని ఎక్సరసైజ్ లు...నిపుణుల అండతో చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అయితే... అదేమీ కాదు తన కొడుకు రామ్ చరణ్ కు చెందిన ఎయిర్ లైన్స్ కు సంభందించిన కొన్ని టైఅప్ లు డీల్స్ గురించి మాట్లాడటానికి ఆయన లండన్ వెళ్లారని అంటున్నారు. అక్కడ పూర్తిగా బిజినెస్ మీటింగ్ లలో బిజీగా ఉంటున్నట్లు చెప్తున్నారు.

    Now Chiranjeevi in London?

    చిత్రం విషయానికి వస్తే...

    పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈచిత్రానికి ప్రస్తుతం ‘ఆటోజానీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మించబోతున్నారు.

    ఈ సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ... ఈ స్టోరీ నేను ఇప్పటికే విన్నాను. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇది పూర్తి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ అయిన కథ అని రాంచరణ్ తెలిపారు. ఇలాంటి చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం దక్కినా అదృష్టంగానే భావిస్తానని చరణ్ చెప్పుకొచ్చాడు.

    సినిమాను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక బృందం ఉందని, నిర్మాతగా తన మొదటి సినిమా చేయడానికి ఎంతోమంది ప్రెజర్ ఫీలయ్యారని, కానీ పూరీ జగన్నాథ్ ఒక్కడే కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పాడు. పూరీకి ఈ కథమీద మంచి పట్టుందని, టోటల్ గా‌ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అవుతుందని చెర్రీ అన్నాడు.

    కాపీ వివాదం... చిరంజీవి 150వ సినిమా ప్రకటన అలా వచ్చిందో లేదో...ఇలా వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం స్టోరీ కాపీ కొట్టారంటూ వివాదం నెలకొంది. ఈ వివాదం నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

    Now Chiranjeevi in London?

    ‘ఆటోజానీ స్టోరీ పూర్తిగా నేను ఒరిజినల్ గా తయారు చేసినల్ స్టోరీ. కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు' అంటూ ట్వీట్ చేసారు. పూరి స్వయంగా వివరణ ఇవ్వడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నాడు.

    కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా గురించి వార్తలు రావడం, ఇప్పటివరకూ అవి వాస్తవ రూపం ధరించకపోవడం తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా రామ్‌చరణ్‌ ఈ సినిమా విషయాన్ని ధృవీకరించంటం అభిమానుల్లో చెప్పలేని ఆనందం కలిగించింది. నిజానికి కొద్ది రోజుల క్రితమే బండ్ల గణేశ్‌ ఈ విషయాన్ని పరోక్షంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పూరి కూడా తన ఉద్వేగాన్ని బయటపెట్టకుండా ఉండలేకపోయారు.

    ఇక ఈ చిత్రానికి కథను అందిస్తున్న బీవీఎస్‌ రవి ‘‘మెగాస్టార్‌ నుంచి అంగీకారం పొందడం ఎంతో ఉత్తేజంగా, ఉద్వేగంగా ఉంది'' అని తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌ చిరంజీవి జన్మదినమైన ఆగస్ట్‌ 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆ రోజు ఆయన షష్ఠి పూర్తి కావడం కూడా విశేషం.

    చిరంజీవి హీరోగా నటించిన చివరి సినిమా ‘శంకర్‌దాదా జిందాబాద్‌' 2007 జూలైలో విడుదలైంది. అంటే అది వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి హీరోగా ఆయన కెమెరా ముందుకు రాబోతున్నారన్న మాట.

    English summary
    Chiranjeevi is right now in London from last couple of weeks and he will be returning on May 30th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X