»   » ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మాత్రమే.. మిగిలినదంతా!

ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మాత్రమే.. మిగిలినదంతా!

Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం మొన్ననే వైభవంగా ప్రారంభంగా అయింది. బాలకృష్ణ తన తండ్రి చరిత్రని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై అభిమానుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ చిత్రంతో అనేక రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉండడమే ఈ అనుమానాలకు కారణం.

ఎన్టీఆర్ జీవితంలో కొన్ని చేదు సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అవి రాజకీయానికి సంబందించిన, కుటుంబానికి సంబందించినవి కావడంతో ఆ అంశాల ప్రస్తావన ఎన్టీఆర్ బయోపిక్ లో ఉంటుందా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. బాలయ్య మాత్రం ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులకు మరపురాని చిత్రంగా నిలిచిపోవాలని భావిస్తున్నారు.

NTR biopic will going to be in two parts

ఎన్టీఆర్ బయో పిక్ గురించి మరో వార్త కూడా తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ జీవితం మహా సముద్రం లాంటిది. ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు, సాధించిన విజయాలు అసామాన్యమైనవి. వాటన్నింటికి కేవలం రెండున్నర గంటలలో వెండి తెరపై ఆవిషరించడం కష్టం. అందువలన ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని దర్శకుడు తేజ ప్లాన్ చేస్తున్న వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ రాజకీయాల్లో విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు మాత్రమే తొలి భాగంలో చూపించబోతున్నట్లు, తదనంతర పరిణామాలని మరో భాగంగా తెరకెక్కిచాడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఏ ఈ చిత్రంలో బాలయ్య దాదాపు 60 కి పైగా గెటప్స్ లో కనిపించబోతున్నాడు.

English summary
NTR biopic will going to be in two parts. Director Teja planning to divide script in two parts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X