»   » మహేష్ కోసం వెయిట్ చేయలేక ఎన్టీఆర్ తోనే...

మహేష్ కోసం వెయిట్ చేయలేక ఎన్టీఆర్ తోనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ తో నెక్ట్స్ ప్రాజెక్టు చేస్తాడని అంతా భావించారు...అయితే మహేష్ వేరే ప్రాజెక్టులతో బిజిగా ఉండటంతో ఎన్టీఆర్ తో మొదట మొదలెట్టాలనే నిర్ణయిం తీసుకున్నారని వార్త. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే పూరీ జగన్నాథ్. హార్ట్ ఎటాక్ తర్వాత ఆయన వెంటనే మహేష్ తో స్క్రిప్టు చేసుకుని ముందుకువెళ్దామనే ప్లాన్ చేసారు. అయితే ఊహించని విధంగా మహేష్ ఇమ్మిడియట్ గా యూ టీవి ఫిల్మ్స్ కు ఎగ్రిమెంట్ ప్రకారం సినిమా ప్రారంభించాల్సి వచ్చింది. దాంతో కొరటాల శివతో ముందుకు వెళ్తున్నారు. ఇది గమనించిన పూరీ ఖాళీగా ఉండటం ఎందుకుని ఎన్టీఆర్ తో ప్రాజెక్టు ఓకే చేయించుకున్నాడని సమాచారం. రభస పూర్తైన వెంటనే ఎన్టీఆర్ తో ఈ చిత్రం ఉండే అవకాసం ఉంది.

పూరీ జగన్నాథ్ రెడీ చేస్తున్న స్క్రిప్టు మరో ఇరవై రోజుల్లో పూర్తవుతుందని,పూర్తి నేరేషన్ ఇచ్చి ఎన్టీఆర్ తో గ్రీన్ సిగ్నల్ తీసుకుంటారని తెలుస్తోంది. ఇది పూర్తయ్యాక మహేష్ తో ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. ప్రస్తుతం మహేష్ తాను చేస్తున్న ఆగడు చిత్రంలో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ రభస షూటింగ్ లో ఉన్నారు. రభస పూర్తవటానికి మరికొంత టైమ్ పట్టేటట్లు ఉంది. పూరీ జగన్నాథ్ ఈ ప్రాజెక్టు ఓకే అనుకుంటే ప్రీ ప్రొడక్షన్ లోకి దిగుతారు.

ఇక 'పోకిరి' తర్వాత పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా మహేష్‌బాబు కనిపించబోతున్న చిత్రం 'ఆగడు'. తమన్నా హీరోయిన్. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 18వరకు ఇక్కడే చిత్రీకరణ ఉంటుంది. 23 నుంచి బళ్లారిలో తెరకెక్కిస్తారు.

నిర్మాత మాట్లాడుతూ... ''దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. దానికి మించి వినోదం పండేలా దర్శకుడు ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. మహేష్‌ పాత్ర చిత్రణ అభిమానులకు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది''అంటున్నారు. పాటల్ని కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Puri, who is known for wrapping up projects at a breakneck speed, has decided to do a film before his project with Mahesh takes off. He is going to direct none other than Jr NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu