»   » హాట్ హాట్ హీరోయిన్ కోసం ఎన్టీఆర్ వేట.. ఎందుకంటే..

హాట్ హాట్ హీరోయిన్ కోసం ఎన్టీఆర్ వేట.. ఎందుకంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటనతోపాటు డాన్యులను ఇరుగదీయడంలో జూనియర్‌ ఎన్టీఆర్ డిఫరెంట్ స్టయిల్. తనదైన శైలిలో జూనియర్ చేసే నృత్యాలు అభిమానులకు జోష్ కలిగిస్తాయి. ఇటీవల వచ్చిన జనతా గ్యారేజ్‌ చిత్రంలో కాజల్‌తో ఎన్టీఆర్ చేసిన ఐటెం పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జై లవకుశలో ఓ ప్రత్యేకమైన పాటను పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోసారి స్పెషల్ సాంగ్‌తో జూనియర్ అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

దిమ్మ తిరిగే పాట రెడీ

దిమ్మ తిరిగే పాట రెడీ

జూనియర్ ఎన్టీఆర్ కోసం రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఓ దిమ్మ తిరిగే పాటను రికార్డు చేశాడట. ప్రస్తుతం ఆ పాటలో హాట్ హాట్ హీరోయిన్‌తో డ్యాన్స్ చేయించాలనే ఆలోచనకు వచ్చారట. దాంతో జూనియర్ పక్కన ఏ హాట్ హీరోయిన్ అయితే బాగుందబ్బా అనే వేటలో పడ్డారట.


వేగంగా షూటింగ్..

వేగంగా షూటింగ్..

తొలిసారి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జైలవకుశ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్ని బాగా ఆకర్షించాయి. ఈ చిత్రాన్ని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేగంగా జరుగుతున్నది.


సిద్ధమవుతున్న జూనియర్

సిద్ధమవుతున్న జూనియర్

ఇదిలా ఉండగా, మా టెలివిజన్‌లో ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమం కోసం జూనియర్ సిద్ధమవుతున్నారు. మొట్టమొదటిసారి టెలివిజన్ షోలో ఎన్టీఆర్ దర్శనమిస్తుండటంతో అత్యంత ఆసక్తిగా మారింది. ఈ రియాలిటీ షో షూటింగ్ ముంబైలో జరుగనున్నది. ఈ షూటింగ్ సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ప్రతీ శుక్రవారం ముంబైలో షూటింగ్‌లో పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు.


స్పెషల్‌గా ఏర్పాట్లు..

స్పెషల్‌గా ఏర్పాట్లు..

బిగ్ బాస్ షో షూటింగ్ వచ్చే ఎన్టీఆర్ కోసం ముంబైలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకునేందుకు స్పెషల్‌గా కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ పాపులర్ షోలో కొందరు సినీ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందిన బిగ్ బాస్ రియాలిటీ షోను తొలిసారి తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్, తెలుగులో ఎన్టీఆర్‌కు ఆ అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.English summary
Young Tiger NTR is getting ready to shake leg for Jai Lavakusha. Music Director Devi Sri Prasad prepared a fantastic song for this movie. And NTR is preparing for debute TV Show Bigboss. Every friday he is going to mumbai for the shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu