»   »  కరెక్టుగా కాజల్ వీక్నెస్ మీద కొట్టాడు

కరెక్టుగా కాజల్ వీక్నెస్ మీద కొట్టాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అతి తక్కవ సమయంలోనే పెద్ద నిర్మాతల లిస్ట్ లో చేరిపోయిన బండ్ల గణేష్ కు ఎవరితో ఏ పని ఎలా చేయించుకోవాలో తెలుసంటారు. అవతల వారి బలహీనతలు,బలాలు తెలుసుకుని జాగ్రత్తగా మసులుకుంటూ తన పనిచేసుకుంటాడంటారు. ఇప్పుడు అదే కోవలో పాల కోవాలాంటి కాజల్ ని తన సినిమాల్లో వరసగా బుక్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. తెలుగులో మరో ఏ ఇతర నిర్మాతలకు డేట్స్ కేటాయించని కాజల్....బండ్ల గణేష్ కి వరసగా మూడోసారి ఇచ్చింది. దీనికి కారణం ఏమిటా అని టాలీవుడ్ ఆలోచనలో పడింది.

గతంలో బండ్ల గణేష్ నిర్మాతగా వచ్చిన 'బాద్‌షా'లో చేసిన ఆమె తర్వాత తెలుగులో ఇదే నిర్మాత నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' కమిటైంది. ఇప్పుడు మళ్లీ ఇదే నిర్మాత నిర్మించనున్న పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్ రానున్న 'కుమ్మేస్తా' చిత్రానికి సైన్ చేసింది. మధ్య గ్యాప్ లో తెలుగులో ఏ ఇతర సినిమా ఒప్పుకోలేదు.

దాంతో బండ్ల గణేష్ కు ఆమె వరస డేట్స్ ఇవ్వటానికి కారణంగా... మధ్య రెమ్యునేషన్ విషయమై కుదిరిన ఒప్పందమే అని చెప్పుకుంటున్నారు. కాజల్ ...రెమ్యునేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని, అదే ఆమె బలహీనత,బలం అని అంటారు. ఆ పాయింట్ మీద గణేష్ వర్కువుట్ చేసాడని అంటున్నారు. బయిట ఏ నిర్మాత ఆఫర్ చేయని విధంగా గణేష్ ఆమెకు రెండు కోట్లు ఇస్తున్నారని, అందుకే ఆమె వెంటనే సై అంటోందని సమాచారం.

NTR to romance Kajal again

ఎన్టీఆర్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో కాజల్‌ ఆడిపాడనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాజల్‌ ఎన్టీఆర్‌తో 'బృందావనం', 'బాద్‌షా'లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు బండ్ల గణేష్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు.

ప్రస్తుతం 'గోవిందుడు అందరివాడేలే' కోసం జతకట్టింది. ఈ సినిమా చిత్రీకరణకు కాసింత విరామం రావడంతో కాజల్‌ చూపు సరదాలవైపు మళ్లింది. ఇంకేముంది స్నేహితులను వెంటబెట్టుకొని షికార్లు చేస్తోంది. అంతేనా ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టి మరీ ఆనందపడుతోంది.

.''నేను ఎక్కడ ఉన్నా స్నేహితులకు దగ్గరగా ఉంటాను. వాళ్లతో ఉంటే అదో తెలియని ఆనందం. అలాంటి ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి? సినిమా సెట్‌లోనూ అందరితో కలివిడిగా ఉండటం అలవాటు. మన చుట్టూ ఉన్నవారితో సఖ్యతగా ఉంటూ.. సరదగా గడిపితే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మన పని కూడా సులభంగా సాగిపోతుంది'' అంటూ గురించి చెప్పుకొచ్చింది కాజల్‌.

''పని.. పని.. పని.. జీవితమంతా ఇలాగే ఉంటే ఇక ఆనందం ఎక్కడుంటుంది. అందుకే చిత్రీకరణలో ఎంత బిజీగా ఉన్నా.. ఓ చల్లని సాయంత్రం అలా స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్రాధాన్యమిస్తాను. వాళ్లతో మాట్లాడుకుంటూ.. చల్లని పళ్ల రసం తాగుతూ ఉంటే ఆ ఆనందమే వేరు'' అంటోంది కాజల్‌

English summary
NTR and kajal agarwal are again going to make a pair in their third combo. Tollywood well known director purijagannath, will also be dealing with screenplay and dioluges while V.Vamsi provided the story. This movie will be produced by bandla Ganesh under Parameshwara Arts production Banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu