»   » ఎన్టీఆర్ ‘జనతా గ్యారెజ్’ కథ ఇదేనా?, ఇన్ సైడ్ టాక్ ఏంటి?

ఎన్టీఆర్ ‘జనతా గ్యారెజ్’ కథ ఇదేనా?, ఇన్ సైడ్ టాక్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారెజ్' పూర్తి స్దాయిలో రిలీజ్ కు రెడీ అయ్యిపోయింది. రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా ఈ అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోస్‌తో సందడి మొదలుపెట్టనుంది.

రేపంతా టాక్ ఏంటి, కథ ఏంటి, ఫేస్ బుక్ లో పోస్ట్ లు ఏమి వచ్చాయి...ట్విట్టర్ లో ఏమంటున్నారు...ఫ్యాన్స్ టాక్ కాకుండా సాధారణ ప్రేక్షకుడు ఏమంటున్నాడు, రివ్యూల్లో ఏం రాసారు, రేటింగ్ ఎంత ఇచ్చారు అనే టాపిక్ లు రన్ అవుతూంటాయి. ఈ లోగా ఇండస్ట్రీలో నడుస్తున్న ఈ చిత్రం కథ, ఇన్ సైడ్ టాక్ అందిస్తున్నాం. అయితే ఎంతవరకూ ఈ కథనంలో నిజం ఉంది అనేది రేపు ఈ టైమ్ నాటికి తెలిసిపోతుంది.


ఇక తన గత చిత్రాల్లానే సోషల్ మెసేజ్ ఉన్న యాక్షన్ డ్రామాగా జనతా గ్యారెజ్ తెరకెక్కిందని, అనవసరమైన సన్నివేశాలేవీ లేకుండా, పూర్తిగా కథ చుట్టూనే తిరిగే ఈ సినిమా 2 గంటల 28 నిమిషాల నిడివి ఉంటుందని దర్శకుడు కొరటాల శివ తెలిపారు.


చిత్రం కథ ఏమిటి, ఇన్ సైడ్ టాక్ స్లైడ్ షోలో చూడండి..


ఎన్టీఆర్ క్యారక్టర్

ఎన్టీఆర్ క్యారక్టర్

ప్రకృతి ప్రేమికుడు ఆనంద్ (ఎన్టీఆర్) ఐఐటి స్టూడెంట్. ఎక్కడ పర్యావరణానికి అన్యాయం జరిగినా పోరాడటానికి ముందుంటాడు. అందుకోసం ఎంతదూరం అయినా వెళ్తూంటాడు.


మోహన్ లాల్ పాత్ర

మోహన్ లాల్ పాత్ర

ఎన్టీఆర్ అంకుల్ (మోహన్ లాల్) సామాన్యుల పక్షాన పోరాడుతూంటాడు. ఆయనదే జనతా గ్యారేజ్.


కానీ ...

కానీ ...

మోహన్ లాల్ ఓ విషయంలో తప్పనిసరి పరిస్దుల్లో సైలెంట్ అయిపోతాడు. ఆయన తనకు రైట్ హ్యాండ్ గా ఓ స్ట్రాంగ్ మ్యాన్ దొరికితే బాగుండును, తనకు సపోర్ట్ గా ఉంటాడని అనుకున్న సమయంలో ఎన్టీఆర్ అక్కడకి వస్తాడు.


మైనింగ్ మాఫియా

మైనింగ్ మాఫియా

గ్యాడ్యుయేషన్ పూర్తైన ఆనంద్ తన అంకుల్ దగ్గరకి వస్తాడు. అయితే అదే సమయంలో మైనింగ్ మాఫియా యాక్టివిటీస్ వల్ల ప్రకృతికి హాని జరుగుతుందని తెలుస్తుంది.


విలన్ ఎంట్రీ

విలన్ ఎంట్రీ

ఆ మాఫియా వెనక ఉన్ని ముకుందన్ అనే ఓ దుర్మార్గుడు ఉన్నాడని తెలిసి వార్నింగ్ ఇస్తాడు. కానీ ఉన్న లెక్క చేయడు.


ట్విస్ట్

ట్విస్ట్

అయితే ఉన్ని ముకుందన్ తండ్రి ఓ మంచి వ్యక్తి ఉన్నాడని తెలుస్తుంది. ఆయన్ను వెళ్లి కలవాలనుకుంటాడు. ఆయన మరెవరో కాదు జనతాగ్యారేజ్ యజమాని మోహన్ లాల్.


మోహన్ లాల్ ని కలిసినప్పుడు

మోహన్ లాల్ ని కలిసినప్పుడు

కొడుకు యాక్టవిటిస్ గురించి చెప్దామని వచ్చిన ఎన్టీఆర్ కు, మోహన్ లాల్ ని చూసి ఆయనతో ప్రభావితుడవుతాడు. మోహన్ లాల్ కేవలం పర్యావరణం గురించే కాకుండా మనుష్యుల గురించి పట్టించుకోమని చెప్తాడు.


ఎమోషనల్ క్లాష్ ..

ఎమోషనల్ క్లాష్ ..

అక్కడ నుంచి మోహన్ లాల్, ఎన్టీఆర్ కలిసి న్యాయం కోసం పోరాటాలు చేస్తూంటారు. అయితే ఇద్దరి మధ్యా ఎమోషనల్ క్లాషెష్ వచ్చే సమయం వస్తుంది. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేస్తాడు అనేది కీలకాంశం.అదే సినిమాలో డ్రామా

అదే సినిమాలో డ్రామా

అలాగే మోహన్ లాల్ సైలెంట్ గా ఉండటం వెనక నిజం ఏమిటి.. జనతాగ్యారేజ్ లో చేరాక ఎన్టీఆర్ లో వచ్చిన మార్పు ఏమిటి..మోహన్ లాల్ తో వచ్చిన విభేధాలు, కీలకమైన ట్విస్ట్ ఏమిటనేది మిగతా కథ.


ఎలా ఉంది

ఎలా ఉంది

సినిమా ఫస్టాఫ్ యావరేజ్ గా ఉన్నా సెకండాఫ్ అద్బుతమైన డ్రామా పండిందని సమాచారం.


స్పెషల్ ఫైట్

స్పెషల్ ఫైట్

సినిమాలో హైలెట్ ఓ స్పెషల్ ఫైట్ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ క్యారక్టరైజేషన్ పర్యావరణ పరిరక్షుకుడు అనే పాయింట్ చుట్టూ ఆ ఫైట్ డిజైన్ చేసారని తెలుస్తోంది.


కాజల్ కేక, సమంత ఓకే

కాజల్ కేక, సమంత ఓకే

కాజల్ డాన్స్ హైలెట్ అని, సమంత రెగ్యులర్ హీరోయిన్ గా కనిపించిందని చెప్తున్నారు. నిత్యామీనన్ పాత్ర డిఫెరెంట్ గా ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు.English summary
According to reports, Janatha Garage has received a fairly positive response post the first screening of the film. Barring few glitches here and there, the film is said to be a commercial entertainer with praises flowing in for NTR and Mohanlal’s combination and performances.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu