»   » ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రం దర్శకుడు ఖరారు

ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రం దర్శకుడు ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రామయ్యా వస్తావయ్యా చిత్రం ప్లాపుతో ఎన్టీఆర్‌ కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రభస(వర్కింగ్ టైటిల్ )ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా గురించి పెద్దగా హడావుడేమీ లేదు. దాని తర్వాత ఎన్టీఆర్‌ ఎవరితో పనిచేస్తాడన్న విషయం గురించే పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.

ఎన్టీఆర్ నెక్ట్స్ చేయబోయే చిత్రం దర్శకుడుగా త్రివిక్రమ్‌, కొరటాల శివ... ఇలా పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. కొరటాల శివతో సినిమా దాదాపు ఖాయమైనట్టే అన్నారు. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు సుకుమార్‌ పేరు తెరపైకొచ్చింది. సుకుమార్ చెప్పిన స్టోరీ లైన్ కి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ బల్క్ డేట్స్ ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని రీసెంట్ గా అత్తారింటికి దారేది చిత్రంలో ఘన విజయం సాధించిన నిర్మాత బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది

ప్రస్తుతం సుకుమార్....మహేష్‌బాబుతో '1' సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఆ వెంటనే ఎన్టీఆర్‌తో సుకుమార్‌ సినిమా మొదలవుతుందని సమాచారం. ఎన్టీఆర్‌ శైలికి తగ్గట్టుగా సుకుమార్‌ పక్కా మాస్‌ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రం ఊసరవెల్లితో నష్టపోయిన...నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కు ఎన్టీఆర్ కాంపన్ షేషన్ గా చేస్తున్న చిత్రంగా... ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

దర్శకుడు సుకుమార్ మొదటి నుంచి తనదైన శైలిలో విభిన్నమైన చిత్రాలు రూపొందిస్తూ వస్తున్నారు. ఆర్య హిట్ తో సుకుమార్ యూత్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారారు. ఎప్పటినుంచో సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయాలనుకుంటున్నారు. అది ఇన్నాళ్లకు తీరబోతోందంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ పూర్తిగా... '1.. నేనొక్కడినే' హడావిడిలో మునిగిపోయి ఉన్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. ఎక్కువ శాతం విదేశాల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ రాక్ స్టార్ గా కనిపిస్తాడని చెప్తున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక ...సుకుమార్... ఎన్టీఆర్ కు చెందిన సినిమా ప్రారంభిస్తారు.

English summary

 Jr. NTR is all set to act in the direction of Sukumar who proved to be a specialist in screenplay and who has a great class appeal. Sukumar is currently directing Mahesh Babu’s 1 (Nenokkadine) film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu